Home వార్తలు జైత్రయాత్ర కొనసాగిస్తా..

జైత్రయాత్ర కొనసాగిస్తా..

saniaహైదరాబాద్ : స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్ జతగా ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్న తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియామీర్జా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటానని పేర్కొంది. ‘హ్యాట్రిక్ గ్రాండ్‌స్లామ్ నెగ్గినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. మా జోడీ ఓటమిచూసి చాలా రోజులైంది. ఎలాంటి విజయాలు సాధించాలని కలలు కన్నానో వాటిని సాకారం చేసుకుంటున్నాను. ఈ ఏడాదిని అద్భుతంగా ప్రారంభించాం. ఎవరూ ఊహించని విధంగా వరుసగా మూడు టైటిళ్లు గెలిచాం. ఇదే జోరును భవిష్యత్తులోనూ కొనసాగిస్తాను’ అని సానియా పేర్కొంది. ఇక పెడ్‌కప్‌లో పాల్గొనేముందు కొన్ని రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటానని తెలిపింది.