Saturday, April 20, 2024

ఢిల్లీలో సుశాంత్ సింగ్ స్ట్రీట్

- Advertisement -
- Advertisement -

Street in Delhi will be named after Sushant Singh Rajput

 

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ వీధికి దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు పెట్టనున్నారు. బతికి ఉంటే సుశాంత్ 35వ సంవత్సరంలో ప్రవేశించేవారు. అయితే సినిమాల్లో తారలా వెలిగిపోతున్న దశలోనే గత ఏడాది జూన్‌లో ముంబై బాంద్రాలోని తన నివాసంలో విషాదాంతం చెందారు. దేశవ్యాప్తంగా సుశాంత్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఢిల్లీలోని అండ్రూస్ గంజ్‌లోని ఓ రోడ్డు ప్రాంతానికి సుశాంత్ పేరు పెట్టాలని అక్కడి పురపాలక సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇక్కడి రోడ్ నెంబర్ 8 ఇక త్వరలోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రోడ్ కానుంది. ప్రస్తుత ప్రతిపాదన పట్ల దేశవ్యాప్తంగా ఉన్న సుశాంత్ అభిమానులు స్పందించారు. తమ అభిమాన నటుడికి పుట్టినరోజున ఇది నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News