Friday, April 26, 2024

సందేశాన్నిచ్చే సినిమా

- Advertisement -
- Advertisement -

street light telugu movie official trailer released

మూవీ మాక్స్ బ్యానర్‌పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో విశ్వ దర్శకత్వంలో మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘స్ట్రీట్ లైట్’. ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్‌తో పాటు టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా విచ్చేసిన దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేయగా, ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మోహన్ వడ్లపట్లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ “సందేశాన్నిచ్చే సినిమా ఇది. పగలంతా పెద్ద మనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి క్రిమినల్ ఆలోచనలతో ఎలా ఉంటారన్న నేపథ్యంలో ఈ సినిమా తీశాం. చీకట్లో జరిగే ముఖ్యంగా స్ట్రీట్ లైట్ కింద జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. ఓ యువతి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడాన్ని ఆద్యంతం సస్పెన్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించాము”అని చెప్పారు. నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ “తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తీశాం. ఈ సినిమాలో మెయిన్ లీడ్ తాన్యా దేశాయ్ అద్భుతంగా చేసింది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News