ప్రస్తుతం అందరికీ ఒకటే సమస్యగా మారింది..అదే జుట్టు సమస్య. పెరిగిన కాలుష్యం, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు కారణాలు ఏవైనా చాలామంది జుట్టురాలే సమస్యలను ఎదుర్కొంటారు. జుట్టు సమస్యలను నివారించుకోవడానికి చాలా మంది రకరకాల నూనెలు, షాంపూలను ఉపయోగిస్తుంటారు. వంటింట్లో ఉండే పుదీనా ఆకులు కూడా ఈ సమస్యలకు చెక్ పెడతాయంటున్నారు నిపుణులు.
* చుండ్రును పూర్తిగా తొలగించడానికి, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, బలాన్ని పెంచడానికి, పుదీనా నూనెను తలకు రాసుకోవచ్చు. ఇది జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాపడుతుంది. పుదీనా ఆకులు పేస్ట్ లేదా పుదీనా నూనెకు కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు రాసుకుంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది. ఈ మిశ్రమం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచి, జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది. పుదీనా నూనెను జుట్టు చివర్లకు రాసుకుంటే.. జుట్టు చివర్లు చిట్లకుండా చేయడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. తలకు పుదీనానూనె రాసుకోవడం వల్ల రక్తప్రసరణకు తోడ్పడి తలను చల్లగా ఉంచుతుంది. పుదీనానూనె జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. తలలో పేలు, చుండ్రును తొలగిస్తుంది.