Home అంతర్జాతీయ వార్తలు రష్యాతో బంధం బలోపేతం

రష్యాతో బంధం బలోపేతం

పదేళ్లలో 30 బిలియన్ డాలర్ల
స్థాయికి ఆర్థిక సహకారం,
ఇండియాలో 12 అణు
కేంద్రాలు, పుతిన్-మోడీ చర్చలు

modi-and-putinమాస్కో    :  రక్షణ రంగం, అణు ఇంధన సహకారం ప్రధాన అంశాలుగా     భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షు లు వ్లాదిమిర్ పుతిన్ మధ్య గురువారం కీలక చర్చలు జరి గాయి. ఇరువురు నేతల వార్షిక శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రష్యా తమకు అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామి అని మోడీ పేర్కొన్నారు. రెండు దేశాలూ రక్షణ రంగంతో పాటు అణు ఇంధన రంగంలోనూ మరింతగా సహకరించుకోవాలని, భారతీయ కంపెనీలు రష్యా చమురు సహజవాయువుల అన్వేషణ ప్రక్రియలోపాలుపంచు కునే అవకాశాలను పరిశీలించాలని ఇరువురు నేతలు నిర్ణ యించారు. క్రెమ్లిన్‌లో 16వ ఇండియా-రష్యా వార్షిక సదస్సు తొలుత ఉభయనేతల మధ్య ముఖాముఖిగా సాగింది. ఆ తరు వాత కొద్ది సేపట్టికి వారికి సంబంధిత దేశాల ప్రతినిధి బృందా లు సహకరించాయి. సమ్మిట్‌ను మోడీతో కలిసి ప్రారంభిస్తూ పుతిన్ రెండు దేశాల కీలక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరం గా, నిరంతరాయంగా సాగుతుందనే విశ్వాసం ఉన్నట్లు తెలి పారు. ద్వైపాక్షిక సంబంధాలు కేవలం ఏ కొన్ని రంగాలకే పరి మితం కాలేదని, బహుముఖంగా విస్తరిస్తున్నాయని, అదే విధంగా అంతర్జాతీయ రాజకీయాలలో , ఆర్థిక , మానవీయ సంబంధాల విషయంలో కూడా ఇరు దేశాల బంధం బలోపే తం అయిందని పుతిన్ పేర్కొన్నట్లు రష్యా వార్తా సంస్థలు తెలి పాయి. ఆర్థిక సహకార విస్తరణకు అనువైన మార్గాలను మరిం తగా అన్వేషిస్తున్నట్లు , ప్రస్తుతమున్న వార్షిక  10 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 30 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చేందు కు రాబోయే పది సంవత్సరాలను గడువుగా పెట్టుకున్నట్లు ఇరువురు నేతలు తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం తరువాత పశ్చిమ దేశాల ఆంక్షలతో ఆర్థికంగా దెబ్బతిన్న రష్యా ఈ దశ లో భారత్‌తో అనేక విధాలుగా ఆర్థిక ఇతరత్రా సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు ఈ సమ్మిట్ కీలక వేదికగా మారింద ని పరిశీలకులు వ్యాఖ్యానించారు. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు రక్షణ ఒప్పందాల ఖరారుకు రంగం సిద్ధం అయింది. చర్చలలో వీటి గురించి ఇరువురు నేతలు మా ట్లాడుకున్నట్లు తెలిసింది. కొన్ని కీలక రకాల సాంకేతిక పరి జ్ఞానం వినిమయం అందించేందుకు రష్యా సిద్ధం అయింది. క మోవ్ -226 హెలికాప్టర్లను సంయుక్తంగా తయారు చేయడం కూడా చర్చలలో ప్రస్తావనకు వచ్చింది. రష్యాకు చెందిన ఎస్ -4– ట్రిముఫ్ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే రష్యాతో భారత రక్షణ మంత్రిత్వశాఖ ఓ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ వ్యవస్థను సంతరిం చుకోవడానికి రూ 40వేల కోట్ల వరకూ వ్యయం అవుతుంది. ఇక అణు ఇంధన రంగంలో పరస్పర సహకారం దిశలో చర్చ లు జరిగాయి. భారతదేశంలో   12 అణు విద్యుత్ కేంద్రాల ఏ ర్పాటు విషయంలో రష్యా సహకారం దిశలో చర్చలు జరిగా యని మోడీ పేర్కొన్నారు.