Home తాజా వార్తలు ఉమ్మడి భోజనంతో ఉపయోగాలెన్నో…

ఉమ్మడి భోజనంతో ఉపయోగాలెన్నో…

joint family

 

అంతా కలిసి తింటే ఒత్తిడి దూరం
ఉబకాయం నుండి ఇట్టే విముక్తి
చిన్నారుల్లో ఆరోగ్యకర అలవాట్లు
వారంలో నాలుగు రోజులు చాలు

కోహెడ : ఏంటి మీ ఇంట్లో అంతా కలిసి ఇలా సందడిగా చలాకీగా ఉంటారా..? మా ఇంట్లో అయితే నిశబ్దం రాజ్యమేలుతుంది. ఇక్కడ ఇలా ఉండటం వల్లనేమో ఈ రోజు కడుపు నిండా తిన్నా అనిపించింది..! ఇలాంటి భోజనం నాకు రోజూ చేయాలని ఉంది… హీరోయిన్ హీరోతోనే, హీరో హీరోయిన్‌తోనో అంటున్న దృశ్యాలు ఇటీవల అనేక సినిమాల్లో కనిపిస్తున్నవే..! ఇదే కా దు. కుటుంబం అంతా కలిసి కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుంటూ భోజనాలు చేయడం అనేది ఒకప్పటి మన సంస్కృతి.. పాత కాలంలో సినిమాల్లో ఇలాంటి దృశ్యాలు అనేకం ఉండేవి..? ఇప్పుడు కాలం మారింది. కా లంతోపాటే అలా కుటుంబం మొత్తం కలిసి కూర్చుని తినే అలవాటు పోయింది. దీనివల్ల అనేక అనార్థాలు రావడమే కాక చేకూరాల్సిన లాభం చేకూరడం లేదని పలు అధ్యాయాలను చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మన తెలంగాణ ప్రత్యేక కథనం…

ఏంట్రా ఆ తినడం… అలా కింద మెతుకులు పడుతున్నా యి. ఒక్కో మెతుకు ఎంత విలువైనదో తెలుసా..? అం దేం టి అలా కొసరి కొసరి వడ్డించుకుంటావు. కాస్త ఎక్కువ వే సుకో అప్పుడే ఒంటికి పడుతుంది. కండ పుష్టి కలుగుతుం ది. అయ్యో పొలమారిందా.. ఇదిగో నీళ్లు తాగు అంటు త ల మర్దించే అమ్మ.. ఏంట్రా ఇవాళ పాఠశాలలో విషయా లు..ఏం చెప్పారు. ఎలా చదివావ్ అంటూ ఆరా తీసే నా న్న. అరేయ్ అవన్నీ పక్కన పెట్టు… ఇదిగో ఈ చెంచా నె య్యి వేసుకో నాన్న బావుంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుందనే నానమ్మ. ఉండవే వాణ్ణి కాసింత కారం తిననయి.

అ ప్పుడే పౌరుషం పెరుగుతుందనే తాతయ్య. అయ్యో ఇ ప్పు డు ఇలాంటి మాటలే వినిపించడం లేదు. కలిసి తినడం మాట అటుంచితే కలిసి ఉమ్మడిగా ఉండే కుటుంబాలే క నుమరుగవుతున్నాయి. దీనివల్ల అనేక దుష్పలితాలు తలెత్తున్నాయని ఇటీవల పలు అధ్యయనాలు నెత్తీ నోరు బాదుకుంటున్నాయి. అన్ని విషయాలు పంచుకునే ఉమ్మడి కు టుంబ భోజనం నేడు కనుమరుగవుతుందని ఆ అధ్యయానాలు ఘోషిస్తున్నాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉందని పలువురు విద్యావంతులు, మేధావులు చెబుతున్నారు.

పల్లె పట్టణం అంతా ఇంతే
ఇప్పుడు ఉమ్మడి భోజనం అనేది పట్టణ వాసులకే కా కుం డా పల్లెల్లోనూ కనుమరుగువుతుంది. పిల్లల చదువుల పే రుతో పక్కనే ఉన్న పట్టణానికి పంపడం, ఇక చేతికి అంది వ చ్చిన పిల్లలు ఉపాధి కోసం వ లస పోవడం ఇలాంటి కారణాలతో ఉమ్మడి భోజనం అనేది ప ట్టణాలతో పాటు పల్లెల్లోనూ తగ్గినట్టు కనిపిస్తుంది. అ యితే ఏదో ఒక పూట మాత్రం పల్లెలో ఈ సంస్కృతి ఉంటే పట్టణాల్లో మాత్రం పూర్తిగా కనుమరుగువుతున్నట్లు చెబుతున్నారు. భార్యా, భర్త ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లల చదువులు వంటివన్నీ దీనికి దోహదం చేస్తున్నాయని వారు తేల్చేశారు. తండ్రి లేచే సరికి పిల్లల అల్పాహారం పూర్తయి పాఠశాలలకు వె ళ్తుతున్నారు.

ఇక మ ధ్యాహ్న భోజనం అనే ది ఎవరి ప్రదేశా ల్లో వారు కానిచ్చేస్తున్నారు. ఇక పిల్లలు పెందలాడే లే వా లని అమ్మలు రాత్రి త్వరగా భోజనం పె డుతునున్నారు. ఆ స మయానికి ఇంటి య జమాని ఇంటికి చేరడం లేదు. తను వచ్చే సరికి పి ల్లలు కాస్తా నిద్రకు ఉపక్రమిసు న్నారు. ఇలా ఎవరి పనుల్లో వారు బి జీగా ఉండి ఎ వరికి వారే నేడు భోజనం సాగించేస్తున్నారు. సెలవు దినాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది.

20 నిమిషాలు చాలు సుమా
వారంలో నాలుగు రోజుల పాటు 20 నిమిషాలు కలిసి తింటే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతా కలిసి తినడం వల్ల చిన్నారుల్లో ఆరోగ్యకర అలవాట్లు అబ్బుతాయంటున్నారు నిపుణులు. పద్దతిగి తినడంతోపాటు ఆ హార ధాన్యాల విలువ తెలుస్తుందని మేధావులు చెబుతున్నారు. ఇవన్నీ వారి అభ్యున్నతికి దోహదం చేస్తుందని పేర్కొంటున్నారు.

ఒత్తిడి దూరం
బయట ఎంత ఒత్తిడి, అలసట ఎదుర్కొని ఇంటికి వచ్చినా ఇంటిల్లిపా ది కలిసి కూర్చుని తినడం వల్ల అదంతా మటుమాయం అవుతుందని అధ్యయనాలు చె బుతున్నాయి. దీంతో మరుసటి రోజు మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు దో హదం చేస్తుందట. ఇదే స మయంలో ఇంట్లో వారు మన కోసం ఉంటారు అనే భావన మదిలో ఉండి బయట చిరుతిళ్ల జోలికి తక్కువగా వెళ్తారట. దీనివల్ల శరీరంలో క్యాలరీలు పెరగకుండా ఉంటాయని అధ్యయానా ల్లో వెల్లడైంది.
అందుకే వారంలో నాలు రో జులు అంతా కలిసి తింటే నాలుగేళ్లు అదనంగా జీవించే అవకాశం వస్తుందని పలువురు నిపుణులు తెలుపుతున్నారు.

Stress distance in the joint family