Home తాజా వార్తలు మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : డిజిపి మహేందర్ రెడ్డి

మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : డిజిపి మహేందర్ రెడ్డి

DGP Mahender Reddyహైదరాబాద్  : మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డిజిపి ముదిరెడ్డి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. మానవ అక్రమ రవాణా హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో బుధవారం మానవ అక్రమ రవాణాపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడారు. పేదరికంలో మగ్గిపోతున్న మహిళలను కొందరు దళారులు వ్యభిచారంలోకి దించుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దళారులను గుర్తించి వారి ఆస్తులను జప్తు చేయాలని, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆయన పోలీసులకు సూచించారు. మానవ అక్రమ రవాణాలో నిందితులను మాత్రమే అరెస్టు చేయాలని, బాధితులను అరెస్టు చేయడం తగదని ఆయ పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేసేలా పోలీసుల చర్యలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణా విషయంలో ప్రజలు పోలీసులకు విధిగా సహకరించాలని ఆయన కోరారు.

Strict Action Against Human Trafficking : DGP