Home తాజా వార్తలు నాటు సారా తయారు చేసే వారిపై కఠిన చర్యలు

నాటు సారా తయారు చేసే వారిపై కఠిన చర్యలు

 Natu Sara

 

వనపర్తి : నాటుసారా తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎస్‌ఐ వెంకట రాములు హెచ్చరించారు. గోపాల్‌పేట మండల పరిధిలోని పొల్కిపాడు తాండాలో బుధవారం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జమ్ములమ్మ తయారు చేసిన నాటుసారా, హన్మంతు తయారు చేసి విక్రయిస్తున్న నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారు తయారు చేసిన బెల్లం పానకాన్ని పారబోశారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్‌ఐ వెంకటరాములు తెలిపారు. ఈసందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. అక్రమంగా నాటుసారా తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అనంతరం 6 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసు కొని 160 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.

Strict action against those who make Natu Sara