Home తాజా వార్తలు బోరుబావులంన్నింటినీ పూడ్చేయాలి : జూపల్లి

బోరుబావులంన్నింటినీ పూడ్చేయాలి : జూపల్లి

Jupally-Krishna-Rao

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పాడైన బోరుబావులన్నింటినీ పూడ్చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడైన బోరుబావుల్ని పూడ్చకుండా వదిలేస్తే భూయజమానులపై రూ.50 వేల వరకు జరిమానా విధించడంతోపాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గురువారం నుంచి అన్ని గ్రామాల్లో బోరు బావులపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ఇక నుంచి బోరుబావి వేయాలంటే 15 రోజుల ముందే అనుమతి తీసుకొవాలని పేర్కొన్నారు.