Home ఆదిలాబాద్ ఉట్నూరులో కఠినంగా లాక్‌డౌన్ అమలు

ఉట్నూరులో కఠినంగా లాక్‌డౌన్ అమలు

Strict Lockdown in Utnoor Adilabad District

ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరులో కరోనా వైరస్ ప్రజలను భయపెడుతోంది. తాజాగా ఉట్నూరులో ఐదుగురికి కరోనా పాజిటిట్ వచ్చింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్నారు అధికారులు. వ్యాపార సంస్థలు, కూరగాయల దుకాణాలను పోలీసులు మూసివేశారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,020 చేరింది. ప్రస్తుతం 1,365మంది బాధితులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,556 మంది కోవిడ్-19తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 99మంది కరోనాతో మృతిచెందారు.

Strict Lockdown in Utnoor Adilabad District