Home భద్రాద్రి కొత్తగూడెం చెత్త… చెత్త

చెత్త… చెత్త

Striking the strike of the village panchayat workers

దుర్ఘంధం వెదజల్లుతున్న పట్టణం
ఎటు చూసినా చెత్త కుప్పలే
గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెతో అస్తవ్యస్తం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లవైపు అధికారులు 

మన తెలంగాణ/భద్రాచలం : పట్టణం చెత్త చెత్తగా మారింది. గ్రామపంచాయతీ కార్మికులు గత ఐదు రోజులుగా సమ్మెబాట పట్టడంతో ఎక్క డి చెత్త అక్కడే పేరుకుపోయింది. దీంతో ఎటు చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. సుందరంగా ఉండాల్సిన పట్టణం సర్వం చెత్తమయం గా మారిపోయింది. దీంతో పట్టణ ప్రజలతో పాటు యాత్రికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాచలం పట్టణంలో 20 వార్డుల్లో సుమారు 50 వేలకు పై బడిన జనాభా ఉన్నారు. గ్రామపంచాయతీ ద్వారా మొత్తం 170 మంది కార్మికులు నిత్యం వివిధ పనులు నిర్వహిస్తుంటారు. ఇప్పుడు వారంతా సమ్మెల్లో ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, నెలకు రూ.18వేల వేతనం చెల్లించాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ, ఫింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో సమ్మె చేసినప్పుడు సమస్యలు పరిష్కరిస్తామని ప్రభు త్వం హామీ ఇవ్వడంతో సమ్మెను విమరించామని, చాలాకాలంపాటు వేచి చూస్తున్నప్పటికీ ప్రభుత్వ వైఖరిలో ఎలాంటిమార్పు రాకపోవడంతో సమ్మె చేపట్టినట్లు కార్మికులు చెబుతున్నారు.

సమ్మెకారణంగా ఎటు చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ఐదు రోజులుగా చెత్త ఏత్తే వారు, రోడ్లు ఊడ్చేవారే లేకపోవడంతో దుర్ఘంధం వెదజల్లుతోంది. దోమల, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. అప్పుడప్పుడు వర్షాలు పడుతుండటంతో చెత్త మొత్తం తడిచిపోయి మరింత ఇబ్బంది కరంగా మారింది. ప్రధాన రహదార్లపై సైతం చెత్తకుప్పలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. మరో ప్రక్క గాలికి చెత్తంగా రోడ్లపైకి చేరుకోవడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. పవిత్ర గోదావరి తీరం సైతంచెత్తచెదారంతో నిండిపోయింది. ఎటు చూసిన కాగితాలు, కవర్లు, పేపర్ ప్లేట్లు ఉన్నాయి. వాటిని ఎత్తేసే దిక్కులేకపోవడంతో కొందరు వాటిని నీళ్లలోనికి వదులుతున్నారు. తద్వారా నీరు కూడా కలుషితం అవుతోంది. అసలే వర్షాకాలం కావడంతో గోదావరి తీరంలో పరిశుభ్రత లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

దోమలు పెరిగిపోయి కుడుతుండటంతో భక్తులు నొచ్చుకుంటున్నారు. పట్టణంలోని మార్కెట్, అంబేద్కర్, యూబి రోడ్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, బస్టాండ్ వెనుక బజార్, తాతగుడి సెంటర్ వంటి ప్రథాన ప్రాంతాలు చెత్త చెదారంతో ఇబ్బందిగా మారాయి. మరో ప్రక్క గ్రామపంచాయితీ ద్వారా నీటి సరఫరా కూడా నిలిచిపోవడంతో ఆయా కాలనీల్లోని ప్రజలు నీటి కోసం తీవ్ర ఎబ్బందులు ఎదుర్కొంటున్నా రు. మురుగు కాలువల్లో సైతంచెత్త నిల్వలు పేరుకుపోయి దోమల వృద్ధి చెందుతున్నాయి. గ్రామపంచాయతీ కార్మికులు సమ్మెలో ఉండటంతో పట్టణంలో చోటు చేసుకున్న అపరిశుభ్రం వాతావరణం కారణంగా ప్రజల నుండి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. దీం తో గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్యా శ్వేత ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను లిఖిత పూర్వకంగా అందించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు పుకా ర్లు వస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో పంచాయతీ కార్మికుల సమ్మె విరమించకుంటే పట్టణాన్ని శుభ్రం చేసేందుకు శ్రీరామ నవమి సమయంలో రప్పించినట్లు రాజమండ్రి నుండి ప్రత్యేక పారిశుధ్య కార్మికులను తీసుకొచ్చి పనులు చేయించనున్నట్లు తెలుస్తోంది.