మనతెలంగాణ/శాయంపేట ః మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన ముంజాల అమరేందర్(24) ఆదివారం రాత్రి తాటి చెట్టు పై నుండి పడి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్థుల కథనం ప్రకారం పత్తిపాకకు చెందిన ముంజాల రవి—రాజక్కలకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడైన అమరేందర్ ఇంటర్ వరకు చదివాడు. తండ్రి అనారోగ్యంతో ఉండడంతో గత 4సంవత్సరాలుగా గీత కార్మికునిగా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం అమరేందర్ ఇంటి నుండి తాటి వనంకు వెళ్లి తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు క్రింద పడి మృతి చెందాడు. అమరేందర్ ఆదివారం రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్నేహితులకు ఫోన్ చేసిన అమరేందర్ ఆచూకి తెలియలేదు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు తాటి వనానికి వెళ్లి చూడగా మృతి చెంది కనిపించాడు. తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజబాబు తెలిపారు.
గీత కార్మికుని మృతి
- Advertisement -
- Advertisement -