Home వనపర్తి నిత్యం అడవిలోనే.. ఈతచెట్లే నివాసం

నిత్యం అడవిలోనే.. ఈతచెట్లే నివాసం

దుర్భ్బరమైన జీవితం.. కల్లు గీత కార్మికుల పని విధానం

                      Toddy

శ్రీరంగాపురంః మండల పరిధిలోని కల్లు గీత కార్మీకులు జీవితం కట్టు బానిక బ్రతుక యింది. నిర్జన ప్రదేశాల్లో గ్రామాలకు దూరంగా ఈత కమ్మలతో గుడిసెలు వేసుకుని వాగుల్లో ,వంపుల్లో ఈతవనాల్లో సుదూర ప్రాంతాల నుండి వలస వచ్చి కల్లు గీత కాంట్రాక్టర్లు ఇచ్చే తక్కువ వేతనాల్లో భార్యా పిల్లలను వదిలి ఈత వనాల్లో రూ. 7 వేలకే జీవనం కొనసాగిస్తున్నారు.చాలీ చాలని వేతనాలతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రాత్రింబవళ్లు  విషపురుగుల మధ్య ఈత వనాల్లో సంచరిస్తు స్వచ్చమైన చెట్టు కల్లును సేకరించి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు.నాగరాల గ్రామ శివారు పరిధిలోని ఈత చెట్లను ఇద్దరు కాంట్రా క్టర్ల మధ్య  స్వచ్ఛమైన కల్లు సరఫరా చేస్తున్నామని నారాయణపేట నుండి వలస వచ్చి కూలీలుగా పని చేస్తున్న  వారు అభిప్రాయపడ్డారు. అంతేకాక నిత్యం ప్రమాదపుటం చుల్లో  కష్టపడుతూ ప్రాణాలను పణంగా పెట్టికల్లును సరఫరా చేస్తు న్నామని వారు అన్నారు. కల్లు గీత కార్మీకులకు  ప్రభుత్వం కల్పించే పథకాలు క్షేత్రస్థాయిలో గీతకార్మీకులకు అందడం లేదని గీత కార్మీ కులు ప్రభుత్వం కల్పించే అన్ని రకాలైన పథకాలకు దరఖాస్తు చేసుకుని ఉపయోగించు కోవాలని ఆప్కారీ శాఖా వారు ఇటువంటి విషయా లనువిస్తృత ప్రచారం కల్పించాలని గీతకార్మీ కు లు కోరు తున్నారు.