Home జగిత్యాల జిలిటెన్‌స్టిక్ పేలి రైతుకు తీవ్రగాయాలు

జిలిటెన్‌స్టిక్ పేలి రైతుకు తీవ్రగాయాలు

man-injured-image
రాయికల్‌: జిలిటెన్ స్టిక్ పేలి ఓ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన రాయికల్ మండలం తాట్లవాయి అటవీ గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాట్లవాయి అటవీ గ్రామానికి చెందిన బొమ్మకంటి శ్రీనివాస్ అనే రైతు తన సోదరుడితో కలిసి పొలం వద్దకు వెళ్లి భూమిని చదును చేసేందుకు గడ్డికి నిప్పు పెట్టాడు. ఈ నిప్పు తన భూమిలోని వ్యవసాయ బావి వరకు వెళ్లడంతో ఇతరుల భూమిలోకి నిప్పు వెళ్లుతుందని గ్రహించి నిప్పును ఆర్పేందుకు శ్రీనివాస్ ప్రయత్నించగా ఆకస్మాత్తుగా జిలిటెన్ స్టిక్ పేలింది. దాంతో శ్రీనివాస్ తీవ్ర గాయాలకు గురయ్యాడు. స్థానికులు క్షతగాత్రుడిని జగిత్యాల ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందజేస్తున్నారు. జిలిటెన్ స్టిక్ పేలిన వ్యవహరంపై సమాచారం అందుకున్న ఎస్‌ఐ కరుణాకర్ సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. తమ వ్యవసాయ బావిలో పూడికతీతకు జిలిటెన్ స్టిక్ తీసుకువచ్చారా? లేదా ఎవరైనా ఆ స్థలంలో జిలిటెన్ స్టిక్ నిల్వ చేసారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.