Home తాజా వార్తలు బావిలో దూకి విద్యార్థిని ఆత్మహత్య

బావిలో దూకి విద్యార్థిని ఆత్మహత్య

Student suicide

 

భీంగల్ : నిజామాబాద్ జిల్లా భీంగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పల్లికొండ గ్రామానికి చెందిన ప్రవళ్లిక అనే విద్యార్థిని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. భీంగల్ ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పల్లికొండ గ్రామానికి చెందిన ప్రవళ్లిక భీంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెలలో జరిగిన పరీక్షలు సరిగా రాయలేదు. దీంతో మనస్తాపానికి గురైన ప్రవళ్లిక శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రవళ్లిక మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

Student commits suicide by jumping into well