Home తాజా వార్తలు అమ్మాయి చేతిలో ఓడిపోయినందుకు…

అమ్మాయి చేతిలో ఓడిపోయినందుకు…

Suicideనల్లగొండ: క్లాసులో లీడర్ పోటీలో తనను ఓ అమ్మాయి ఓడించిందన్న మనస్తాపంతో బాలుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… రామన్నపేటలోని కృష్ణవేణి స్కూల్ లో సాయి చరణ్ అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. గత వారంలో క్లాస్ లీడర్ ఎంపిక నిమిత్తం యాజమాన్యం పోటీలు నిర్వహించింది.
ఈ పోటీల్లో సాయి చరణ్ నిలబడ్డాడు. అయితే విద్యార్థులంతా కలిసి పోటీలో నిలిచిన మరో అమ్మాయిని గెలిపించారు. తోటి అమ్మాయి చేతిలో ఓడిపోయానన్న మనస్తాపంతో గురవారం సాయంత్రం ఇంటి నుంచి సాయి వెళ్లిపోయాడు. దీంతో అతని కోసం వెతుకుతుంటే, పట్టణ శివార్లలోని రైలు పట్టాలపై అతని మృతదేహం లభ్యం అయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
Student Commits Suicide in Yadadri Bhuvanagiri