Home జాతీయ వార్తలు బిస్కట్ ప్యాకెట్ దొంగిలించాడని బాలుడిని చంపారు…

బిస్కట్ ప్యాకెట్ దొంగిలించాడని బాలుడిని చంపారు…

Dehradun police

డెహ్రాడూన్: ఒక షాప్ నుంచి బిస్కట్ ప్యాకెట్ దొంగిలించాడని ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడిని అతని కంటే సీనియర్ లైన ఇద్దరు విద్యార్థులు దాడిచేసి చంపేశారని పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ జిల్లా రాణిపోఖ్రి జిల్లాలో ఈ దారుణం జరిగింది. మార్చి 10న ఆ స్టూడెంట్‌ను చంపారు. కొడుకు శవాన్ని ఇంటికి తీసుకెళ్లలేనని బాలుడి తండ్రి చెప్పగా, 11న స్కూల్ ఆవరణలోనే పాతిపెట్టారు.

బాలుడిని చంపిన, 12వ తరగతి చదువుతున్న ఆ ఇద్దరు విద్యార్థులను, ముగ్గురు స్కూలు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పిల్లవాడిని గట్టిగా కొట్టడంతో శరీరం లోపల తగిలిన గాయాలవల్ల మరణించాడని మార్చి 23న జరిపిన పోస్ట్‌మార్టంలో వెల్లడైంది. అయిదుగురు నిందితుల్ని జైలుకు పంపించారు. ‘బాలుడిని చంపిన ఇద్దరినీ హత్యానేరం కింద, సాక్షం లేకుండా మాయం చేసినందుకు స్కూల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నాం’ అని రాణిపోఖ్రీ పోలీస్ ఆఫీసర్ పిడి భట్ తెలిపారు.

student dead by seniors attack for stealing Biscuits