Friday, April 19, 2024

పాముకాటుతో విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

Student dead with snake bite

 

మన తెలంగాణ/లింగంపేట: కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో బుధవారం రాత్రి 12 ఏళ్ల బాలిక పాము కాటుతో మృతి చెందింది. దీంతో విద్యార్థి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… మంగలి తులసీ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల తాడ్వాయిలో ఏడో తరగతి చదువుతుంది. చిన్నప్పుడే బుడిబుడి అడుగులు వేసే సమయంలో కన్నవారు దూరమయ్యారు. కూతురు జన్మించిన సంవత్సరం తర్వాత తండ్రి మృతి చెందారు. అదే విధంగా తల్లి మన్నెమ్మ ఆరు నెలల పసిపాప ఉన్నప్పుడు తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. కన్నవారు దూరం కావడంతో పోషించే బాధ్యత తాత, అమ్మమ్మపై పడింది. బుధవారం అర్ధరాత్రి తాతయ్య నారాయణ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నల్ల కట్లపాము చొరబడి నిద్రిస్తున్న తులసి కాళ్లను పట్టి లాగింది. దీంతో నిద్ర నుంచి లేచి కేకలు వేసింది. పక్కనే పడుకున్న వారి కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి పాము కనిపించడంతో పాము తులసి వేలును గట్టిగా పట్టుకుంది. దీంతో వారు పామును గుంజినా రాకపోవడంతో దుప్పటి వేసి గుంజినారు. అనంతరం పామును చంపివేశారు. విద్యార్థిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అమ్మమ్మ తాతయ్యలు గారాబంగా పెంచిన మనుమరాలు కళ్లముందే పాముకాటు వేసి మృతి చెందడంతో వారి రోదనలు మిన్నంటాయి. చుట్టు ప్రక్కలవారు తోటి విద్యార్థులు సైతం దుంకించడంతో ఆ వాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News