Home జోగులాంబ గద్వాల్ రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Student Died In Road Accident At Jogulamba Gadwalజోగులాంబ గద్వాల : అయిజ మండలం వెంకటాపురంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వేగంగా వచ్చిన కారు  ఓ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం శివకుమార్ రెడ్డి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కారును అతివేగంగా నడిపించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.