Home తాజా వార్తలు రైలు ఢీకొని యువకుడు మృతి

రైలు ఢీకొని యువకుడు మృతి

Accident

కాచిగూడ : ప్లాట్‌ఫారంపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్యాసింజర్ రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేపోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాబుబ్‌నగర్ జిల్లా,దేవరకద్ర మండలం,కౌకుంట్ల గ్రామానికి చెందిన  మెట్ల జయకృష్ణ(26)బీటెక్ పూర్తి చేశాడు. గత రెండు సంవత్సరాలుగా ఐఏఎస్ కోసం కోచింగ్ తీసుకుంటు హాస్టల్ లో ఉంటున్నాడు. మలక్‌పేట రైల్వేస్టేషన్ ప్లాట్ ఫారం-1 అంచున నడుచుకుంటూ వెళ్తుండగా  ప్యాసింజర్ రైలు ఢీకొని జయకృష్ణ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

student dies after hitting passenger train in kachiguda station