Home తాజా వార్తలు ఎస్‌సి హాస్టల్‌లో షార్ట్‌ సర్క్యూట్

ఎస్‌సి హాస్టల్‌లో షార్ట్‌ సర్క్యూట్

short circuit

మంటల్లో చిక్కుకుని చిన్నారి స్పందన దుర్మరణం ఖమ్మం నగరంలో విషాదం

ఖమ్మం నగరంలో షెడ్యూల్డ్ కులాల సంక్షే మశాఖ వసతిగృహంలో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవడం తో స్పందన అనే చిన్నారి మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రాత్రి 11.30గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావటంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఆ సమయంలో మం టలు వ్యాపించటంతో వసతిగృహంలో ని ద్రిస్తున్న విద్యార్ధులు ఒక్కసారిగా కేకలు వేశారు. విషయం గ్రహించిన వాచ్ ఉమె న్, స్థానికులు వసతి గృహం వద్దకు చేరుకుని పిల్లలను రక్షించారు. కాగా ఆ సమయంలో విద్యార్ధులు ఉన్న గదికి లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి తలుపులను తెరిచి చిన్నారులను కాపాడారు. అ గదిలో ఉన్న విద్యార్ధినులందరూ క్షేమంగా బయటపడ్డారు. కాని విద్యుత్ షార్ట్ సర్యూట్‌తో ప్రమాదంలో చిక్కుకున్న చిన్నారి స్పందన మాత్రం మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచింది. వసతిగృహంలో ఉండి చదువుతున్న చిన్నారి బరపటి స్పందన కుటింబీకులు నగరంలోని బొక్కలగడ్డ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

తండ్రి సంజీవ స్థానికంగా డ్రైవర్‌గా, తల్లి లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. షార్ట్‌సర్కూట్‌తో చిన్నారి స్పందన మృతి చెందిన సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్‌సి కార్పొరేషన్ అభివృద్ధి అధికారి కస్తాల సత్యనారాయణ తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వసతిగృహంలో ఉన్న విద్యార్ధులను ప్రక్కనే ఉన్న మరో వసతిగృహంలోకి తరలించారు. ఘటనలో గాయాలైన విద్యార్ధులు ప్రవళిక, అమూల్య, నందినిలకు వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. వసతిగృహంలో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉండటంతోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మరణించిన స్పందన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. సంఘటన గురించి జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి కస్తాల సత్యనారాయణను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

తక్షణమే బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బాలిక కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్నారి దహన సంస్కారాలకు రూ. 25వేలు, ఇతర సహకారం అందించారు. ఈ ఘటనపై రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందిస్తూ జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కస్తాల సత్యనారాయణతో ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 student dies due to short circuit in Sc Girls hostel