Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో చిన్నారి విద్యార్థిని మృతి

రోడ్డు ప్రమాదంలో చిన్నారి విద్యార్థిని మృతి

Road Accidentహైదరాబాద్ : కూకట్‌పల్లి పరిధిలోని ఎవిబి పురంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి విద్యార్థిని మృతి చెందింది. పాఠశాలకు వెళ్లిన చిన్నారి రిషిత ఇంటికి తిరిగి వస్తుండగా బొలెరో వాహనం ఢీకొంది. దీంతో రిషిత అక్కడికక్కడే చనిపోయింది.  రిషిత సెయింట్ రిటా హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు. రిషిత మృతితో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం కోసం రిషిత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student Dies In Road Accident At Hyderabad Today