Home Default పుట్టినరోజున రైలు భోగీపై సెల్ఫీ..!

పుట్టినరోజున రైలు భోగీపై సెల్ఫీ..!

Selfie-with-Running-Train

చెన్నై : రైలు భోగీపైకి ఎక్కి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన చెన్నై తాంబరం రైల్వే క్వార్టర్స్‌ వద్ద చోటు చేసుకుంది. క్వార్టర్స్ లో నివాసముండే.. మారిముత్తు కుమారుడు దిలీపన్‌(18) ప్రైవేట్‌ ట్యూటోరియల్ లో ప్లస్‌టు చదువుతున్నాడు. ఆగస్టు 26న తన పుట్టిన రోజు సందర్భంగా మిత్రులతో కలిసి రైల్వేస్టేషన్‌కు వెళ్ళాడు. అక్కడ ఆగి ఉన్న ఓ ట్రైన్ భోగీపైకి ఎక్కి అక్కడ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. కానీ ఆ భోగీపై ఉన్న హై ఓల్టేజీ వైర్ ను అతడు గమనించలేదు. దీంతో సెల్ఫీ దిగే క్రమంలో ఆ వైర్ తగిలి దిలీపన్ షాక్‌కు గురై దూరంగా విసిరివేయబడ్డాడు. తీవ్రంగా గాయపడిన దిలీపన్‌ను మిత్రులు సమీపంలో గల ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించటంతో కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.