Friday, April 19, 2024

విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసి… తోటలో పడేశారు…

- Advertisement -
- Advertisement -

Student legs hands tied with thread

అమరావతి: డిగ్రీ విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేపడేసి తోటలో వేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా గుర్ల మండలంలో జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తెర్ల మండలం లోచర్ల గ్రామానికి చెందిన రమా అనే యువతి విజయనగరంలో ఎస్‌కె డిగ్రీ కాలేజీలో చదువుతోంది. గుర్తు తెలియని దుండగులు ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఒక తోటలో వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. బాధితురాలు ఆ స్థలానికి ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News