Home నల్లగొండ ఆదర్శ పాఠశాల సమస్యల వలయానికే పరిమితమా..?

ఆదర్శ పాఠశాల సమస్యల వలయానికే పరిమితమా..?

Students Facing Drinking Water Problem In Schools

మన తెలంగాణ/నాంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, కళాశాల ప్రధాన ద్వారం వద్దనే మిషన్ భగీ రథ మెయిన్ పైపులైన్ ఓహెచ్‌బిఆర్ 40 వేల లీటర్ల సామర్థం కలిగిన ట్యాంకు ఉన్నా విద్యార్థులకు తాగటానికి కనీసం మంచినీటి సరఫరా లేక విద్యార్థులు గొంతు తడుపుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఇంటి వద్ద నుండి వాటర్ బాటిళ్లు వెంట తెచ్చుకునే దుస్థితి నెలకొన్నది. నాంపల్లి మండల కేంద్రానికి కూతవేటు దూర ంలో పెద్దాపురం గ్రామ పంచాయతీ పరి ధిలో చక్కని ఎత్తైన ప్రదేశంలోని పలు గురాళ్ల గడ్డపై ఆదర్శ పాఠశాల, కళా శాల భవన సదుపాయం కల్పి ం చా రు. పాటశాల ఆవరణలో చక్కటి వెలుతూరు, వాతావరణంలో విద్యా ర్థులు చదువుకోవడానికి అనువుగా ఉండటంతో పాఠశాల, కళాశాలలో ప్రవేశం పొందటానికి విద్యార్థుల తల్లి దండ్రులు పోటీ పడుతున్నా సీట్లు లభించ ని పరిస్థితి ఉంది. ఇంత ఆదర్శవంతమైన పాఠ శాల, కళాశాలకు కనీస అవసరమైన మంచినీటి సదు పాయం లేక రోజు మధ్యాహ్నం భోజ నం సమయంలో 20 లీటర్ల క్యాన్లు ఇరువై తెప్పించి పెదవులు తడుపు తూ విద్యార్థుల దప్పికను పెదవు లకు పరిమితం చేస్తున్నారు. అధికా రులు, ప్రజాప్రతినిధులు పాఠ శా లను సందర్శించి విద్యార్థులకు ఓదా ర్పు మాటలు చెప్పి వెళ్లిపోవడం తప్ప ఒరగబెట్టింది ఏమీలేదు. ఆదర్శ పాఠ శాలకు సంబంధించిన బోరు బావి ఆర్ అండ్‌బి మెయిన్ రోడ్డు దగ్గరలో ఉంది. ఈ బోరు నీరు గాఢమైన సాంధ్రతతో ఫ్లోరిన్, ఉప్పు నీటిగా ఉండటంతో దా తలు పాఠశాలకు అందజేసిన అతి విలువైన నీటి శుద్ది యంత్రం పాఠశాల ఆవరణలో నిరుప యోగంగా ఉంది.

ఈ నీటి శుద్ది యంత్రాన్ని బోరు నీటి కోసం వాడితే తొందరగా దెబ్బ తింటుందని ప్రక్కన పడవేసినట్లు తెలుస్తుంది. మిషన్ భగీరథ మెయిన్ పైపులైన పాటశాల సింహద్వారం ముందే ఉన్నందున నీటి సరఫరా ఇంజనీరింగ్ అధికారులు ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థుల వైపు కన్నెత్తి చూస్తే వారి తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. ఆదర్శ పాఠశాల ఆవరణ ఎర్రబంకమట్టి పలుగురాళ్లతో కూడుకుని విశాలమైన ఖాళీ ప్రదేశం ఉన్నందున హరితహారం కింద గుంతలు తవ్వించిఇ ఉపాధి కూలీలతో మొక్కలు నాటించి నీరు అందిస్తే పాఠశాల ఆవరణ చక్కటి గాలులతో మరింత అహ్లా ద కరంగా మారే అవకాశం ఉన్నందున సంబంధిత అ ధి కారులు పాఠశాలపై దృష్టి సారించాలని విద్యా ర్థులు కోరుతున్నారు. ఆదర్శ పాఠశాల ఆవరణలో విద్యార్థులు వివిధ రకాల ఆటలు ఆడుకోవడానికి సరిపడ గ్రౌండ్ ఉన్నా ఎత్తు పల్లాలతో ఉన్నందున చదును చేయిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. పాఠశాల ఆవరణ అంతా పలుగురాళ్లు తే లి ఉండటం వల్ల విద్యార్థుల పాదాలకు నిత్యం గా యాలై రక్తసిక్తం అవుతున్నా వారి గోడు వినే పరి స్థితిలో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతిని ధులు ప్రస్తుతం లేకున్నా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలకు పలుగురాళ్ల బెడద లేకుండా చదును చేయించాలని విద్యార్థులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల సింహ ద్వారం వద్ద నుండి మెయిన్ రోడ్డు వరకు వేసిన అప్రోచ్ మట్టిదారి వర్షపు నీటికి కొట్టుకుపోయి మొనదేలిన పలుగురాళ్లు దర్శనం ఇస్తున్నందున కాలి నడకన, సైకిళ్లపై పాఠశాలకు రాకపోకలు సా గిం చే విద్యా ర్థులు తరచు క్రిందపడిపోయి పలుగు రాళ్లు గు చ్చుకుని గాయాలపాలై ఆస్పత్రులకు వెళు తున్నా రు. ఈ అప్రోచ్ రోడ్డును సిమెంట్ రోడ్డుగా మారిస్తే వి ద్యార్థుల వెతలు తీరే అవకాశాలు ఉ న్నాయి ఆద ర్శ పాఠశాలలో 100 మంది విద్యార్థు లకు వసతి సౌ క ర్యం ఉన్నందున దూరప్రాంత పాఠశాల, కళా శాల విద్యార్థులకు మాత్రమే వసతి కలిగిస్తున్నారు.