Friday, December 2, 2022

పోస్ట్ గ్రాడ్యూయేషన్ ఎంట్రన్స్‌లో మధిర విద్యార్ధుల ప్రతిభ

- Advertisement -

Students got rank in CPGIT entrance

 

మన తెలంగాణ/ మధిర: రాష్ట్ర స్థాయి పోస్ట్ గ్రాడ్యూయేషన్ కామన్ ఎంట్రన్స్‌టెస్ట్(సిపిజిఇటి)లో మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్ధులు తమ ప్రతిభ చాటి ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన కొంకిమళ్ళ కార్తీక్ ఎంకామ్‌లో 229వ ర్యాంకు సాధించగా, కనమాల నాగరాజు ఎంఎల్‌ఐబిఐఎస్‌సిలో 621వ ర్యాంకు, ఎంకామ్‌లో 914వ రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎల్‌ఎన్.శాస్త్రి తెలిపారు. వీరితో పాటు మరో ముగ్గరు విద్యార్ధులు కూడా సీటు సంపాదించేందుకు అవరమైన ర్యాంకులు పొందారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్ధులను ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్ధినీ, విద్యార్ధులు తదితరులు అభినందించారు.

Related Articles

- Advertisement -

Latest Articles