Home జోగులాంబ గద్వాల్ డిజిటల్ రంగంలో రాణించేందుకు సిద్ధంగా ఉండాలి…

డిజిటల్ రంగంలో రాణించేందుకు సిద్ధంగా ఉండాలి…

Technical Education

 

8,9తరగతి విద్యార్ధులకు కంప్యూటర్ శిక్షణ
డిజిటల్ గద్వాల కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ ,ఎమ్మేల్యే

గద్వాల : డిజిటల్ రంగంలో ప్రపంచం చాలా వేగంగా రాణిస్తుందని, వారితో పాటు భారతదేశ యువత సైతం డిజిటల్ రంగంలో రాణించేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డిజిటల్ గద్వాల కార్యక్రమాన్ని ఎమ్మేల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ప్రార ంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ యాత్ర గద్వాల సం కల్పంతో దాదాపు 150మంది వివిధ మల్టీలెవల్ కంపెనీల్లో పని చేస్తున్న సాప్ట్ వేర్ ఇంజనీర్లు, 10మంది సిఇఒలు శుక్రవారం గద్వాల, అలంపూర్ ప్రాంతాల కు రావడం జరిగిందని తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8,9 తరగ తులు చదువుతున్న విద్యార్ధులకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సభ్యులు శని, ఆదివారాల్లోని వారికి ఉన్న సెలవులను రద్దు చేసుకుని రెండు రోజుల్లో కంప్యూ టర్, బెసిక్స్‌తో పాటు ఈ మెయిల్ క్రియేట్ చేయడం, బ్రౌసింగ్ విధానం వంటి సాంకేతిక విద్యను నేర్పించడం జరుగుతుందన్నారు. దీని కోసం జిల్లాలో 90 పాఠశాలలను ఏర్పాటు చేసి 1250 మంది విద్యార్ధులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈరెండు రోజులే కాకుండా ప్రతి పాఠశాలలో ఒక నోడల్ టీచర్‌ను ఏర్పాటు చేసి నెల రోజుల పాటు శిక్షణను కొనసాగించడం జరు గుతుందని పేర్కోన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన (టీఐటీఎ) స్టాప్‌వేర్ ఇంజనీర్లకు ఆయన ధన్యావాదాలు తెలిపారు.

అనంతరం ఎమ్మేల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో అప్పటి కలెక్టర్ శ్రీదేవి డిజిటల్ తరగతులకై 80పాఠశాలలో కంప్యూటర్లు ఏర్పా టు చేసి విద్యార్ధులకు డిజిటల్ తరగతులను నిర్వహించారన్నారు. గట్టు మండ లం దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడి ఉందని , ఈమండంలోని కనీసం నా లుగు గ్రామాల్లో సాప్ట్‌వేర్ ఇంజనీర్లు లేదా సిఇఒలు దత్తత తీసుకుని విద్యా పరంగా ఆభివృద్ది చేయాలని కోరారు. అనంతరం స్టాప్‌వేర్ ఇంజనీర్ల వారికి కెటాయించిన బస్సులను కలెక్టర్, ఎమ్మేల్యేలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఐటిఎ ప్రతినిధి సందీప్, జిల్లా గ్రంధాయల చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంఈఒ ప్రతాప్‌రెడ్డి, పాఠశాల హెడ్‌మాస్టర్ విషు పాల్గొన్నారు.

Students must learn Technical Education