* రోజు కూరగాయలు కోస్తున్న విద్యార్థులు
* చికెన్ 65 భుజిస్తున్న అధ్యాపకులు
* లీకైన వీడియోలు, సోషల్ మీడియాలో హల్‌చల్
* పట్టించుకోని అధికారులు
మన తెలంగాణ/మహబూబాబాద్ ఎడ్యుకేషన్: నిరు పేద మైనారిటీ,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించి సకాలంలో నాణ్యమైన విద్యను అందించడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేయకుండా సదుద్దేశ్యంతో ప్రభుత్వం లక్షలాది రూపాయలు కేటాయించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకుల విద్య అద్యాపకుల నిర్లక్షంతో కుంటు పడుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ ఎన్‌హెచ్ 365 రోడ్డుకున్న మైనారిటీ గురుకులంలో 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు 300ల మంది విద్యార్దులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 15 మంది ఉపాధ్యా యు లు విద్యాను బోధిస్తున్నారు. నాన్ టీచింగ్ 11 మంది ఉండగా అందులో నలుగురు వంట మనుఘ్యులుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజు వంట ఆల స్యంగా అవుతున్నాయని భావించి, వంట తొందరగా కావడానికి విద్యార్థులతో నిత్యం కూరగాయలు కోపి స్తూ, వంట పనులు చేయిస్తున్నారు. తిరస్కరిం చినా విద్యార్దులను కొంత మంది ఉపాధ్యాయులు బెదిరిం పులకు పాల్పడ్డారు. మెనూలో స్వల్ప మార్పులు చేసి ప్రతి రోజు ఉపాద్యాయులోని ఓ వర్గం చికెన్ 65 భుజి స్తున్నారు. ఈ వీడియోలు లీకై ఎవరో సోషల్ మీడియా లో పెట్టడంతో మానుకోట జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో విద్యార్థులు గురుకులం లో నరకయాతన అనుభవిస్తున్నారని పలువురు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్దులతో పనులు చేయి స్తున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తు న్నారు. ఈ విషయమై మన తెలంగాణ ప్రతినిధి ప్రన్సిపాల్‌ను వివరణ కోరగా తన కుటుం బంలో సహకరించిన మాదిరిగానే గురుకులంలో విద్యార్థుల సహాకారం తీసుకుంటున్నామన్నారు. బలవంతంగా పనులు చేయించటం లేదని పేర్కొన్నారు.
గురుకులంలో విచారించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
మహబూబాబాద్‌లోని మైనారిటీ గురుకులంలో విద్యా ర్ధులతో కూరగాయలు కోయిస్తున్న అధ్యాపకుల వీడి యోలు లీక్ అవటంతో సమాచారం తెలుసుకున్న ఎస్ ఎఫ్‌ఐ విద్యార్ధి సంఘం బృంధం సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్ధులను, వర్కర్‌లను విషయాలు అడిగి తెలుసుకున్నారు.
అధికారులు నిజ నిర్ధారణ చేసి విద్యార్ధులతో కూరగా యలు కోయించిన సదరు వార్డెన్, ప్రిన్సిపాల్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్య క్రమాలు తప్పవని హెచ్చరించారు. హాస్టల్‌ను సందర్శి ంచిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాలోత్ శాంతికుమార్, ఎండీ రజాక్, తదితరులున్నారు.