Home తాజా వార్తలు మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత…

మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత…

Students

 

ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ సర్కిల్ పరిధిలోని కడెం మండలం లింగాపూర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదేగ్రామంలోని బిసి బాలుర వసతి గృహానికి చెందిన 13 మంది విద్యార్థులు ఆ పాఠశాలలో తోటి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు కొడి గుడ్డు, పప్పుతో భోజనం చేసినట్లు విద్యార్థులు తెలిపారు.

మధ్యాహ్న భోజన ఆనంతరం 3 గంటల సమయంలో విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. అయినా పాఠశాల సాయంత్రం సమయం గడిచేవరకు పాఠశాలలోనే ఉన్నారు. నాలుగు గంటలకు వసతి గృహానికి చేరుకోని తీవ్ర ఆస్వస్థతకు గురై పడిపోయారు. గమనించిన వసతి గృహ సంక్షేమ అధికారి రవీందర్ లింగాపూర్ నుంచి ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుత చికిత్స పొందుతున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలోనే విద్యార్థులు ఆస్వస్థతకు గురైనప్పటికి పాఠశాల ఉపాధ్యాయులుగాని, ఎవరుగాని విద్యార్థుల ఆరోగ్యంపట్ల స్పందించకుండా గోప్యంగా ఉంచారు.

Students were Sick after Eating Meal