Home జోగులాంబ గద్వాల్ గద్వాలలో రోడ్డు ప్రమాదం: సబ్ ఇంజినీర్ మృతి

గద్వాలలో రోడ్డు ప్రమాదం: సబ్ ఇంజినీర్ మృతి

Road-Accidentజోగులాంబ గద్వాల: గద్వాల సమీపంలో మంగవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనలో సబ్ ఇంజినీర్ సంజీవులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇంజినీర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సంజీవులు మల్దకల్ సబ్‌స్టేషన్‌లో సబ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వరంగల్ నుంచి గద్వాలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

Sub Engineer Died in Road Accident at Gadwal District