*ఎస్‌సి ప్రత్యేక అభివృద్ధి నిధికి
కేటాయించింది రూ.14,375.13
కోట్లు కాగా, విడుదలైంది
రూ.5 వేల కోట్లే
*ఆర్థిక సంవత్సరం ముగియడానికి
రెండు నెలలే గడువు
*సబ్సిడీ రుణాలు అందక
లబ్ధిదారులు విలవిల
*పూర్వపు ఉపప్రణాళికల దారిలోనే
ఎస్‌సి నిధుల వ్యవహారం
మన తెలంగాణ/ హైదరాబాద్ : మరో రెండు నెలల్లో ప్రస్తుత ఆర్థి క సంవత్సరం ముగియబోతు న్నా ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఖర్చు కా కుండానే మిగిలిపోతున్నాయి. మరోవైపు సబ్సిడీ రుణాల కోసం ఎస్‌సి లబ్ధిదారులు జిల్లా ఎస్‌సి కార్యనిర్వహణాధికారి కా ర్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్‌సిల కోసం బడ్జెట్‌లో ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసినా స్పష్టమైన విధి విధానాలు రూపొందించక పోవడంతో కేటాయింపులు ఆ మేరకు జరగలేదు. ఈ నిధులు ఇతర పథకాలకు మళ్లాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్‌సిలకు ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగానే నిధులను కేటాయించినా వినియోగంమాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఎస్‌సి ప్రత్యేక అభివృద్ధి నిధికి తెలంగాణ ప్రభుత్వం విధి విధానాలను ఇటీవ ల రూపొందించింది. అయితే బడ్జెట్ కేటాయింపులకు నిధుల విడుదలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌సి ప్రత్యేక అభివృద్ధి నిధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.14,375.13 కోట్లు కేటాయిస్తే అందులో దాదాపు 5 వేల కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. నిధులు విడుదలలో జాప్యం కారణం గా ఎస్‌సి లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు సకాలం లో మంజూరు కావడంలేదు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఇది ప్రభావం చూపుతోం ది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి నాలుగేళ్ళలో ఎస్‌సి ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.12,733.84 కోట్లు కేటాయిస్తే రూ.6,792.95 కోట్లు మాత్రమే ఖర్చయింది. తెలంగాణ రాష్ట్రంలో కేటాయింపులు పెరిగినా నిధుల వినియోగంలో పెద్దగా మార్పు లేదు. 2014——–15 సంవత్సరంలో ఎస్‌సిల ప్రత్యేక అభివృద్ది నిధికి తెలంగాణ ప్రభుత్వం రూ.7,579.45 కోట్లు కేటాయించగా అందులో రూ.2,936.26 కోట్లు మ్రాత్రమే ఖర్చయింది. 201516 లో రూ.8,089 కోట్లకుగాను రూ.4,682.48 కోట్లు ఖర్చయింది. 201617లో 10,483 కోట్లకుగాను రూ.5,257.61 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 14,375.13 కోట్లు కేటాయిస్తే సగం కూడా ఖర్చు చేయలేదు. ఎస్‌సి సబ్సిడీ రుణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.