Home తాజా వార్తలు మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్‌ఐ

మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్‌ఐ

 

మంచిర్యాల : మనోవేదనతో తీవ్రంగా కలతచెంది రైల్వేలైన్‌పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న బాధిత మహిళను గుర్తించి చివరి క్షణంలో ఆమెను పోలీస్ ఎస్‌ఐ కాపాడిన ఉదంతం శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఉదయం స్ఠానిక రాజీవ్‌నగర్‌లో కార్డన్‌సెర్చ్‌ను పోలీసులు నిర్వహించారు. అనంతరం ఎస్‌ఐ ఓంకార్‌యాదవ్, తోటి పోలీస్ సిబ్బందితో తిరిగి పట్టణానికి తిరిగి వస్తుండగా హమాలివాడ ప్రాంతంలోని రైల్వేట్రాక్‌పై ఒక మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్నట్లు గుర్తించి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. హుటాహుటిన ట్రాక్‌ వద్దకు చేరుకొని బాధిత మహిళను ఎస్‌ఐ మహిళ సిబ్బందితో అదుపులోకి తీసుకొని ప్రాణాలు కాపాడారు. అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్న మహిళను గుర్తించి చివరి క్షణంలో ప్రాణాలు కాపాడిన ఎస్‌ఐ చొరవను పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

Sub inspector rescues Woman from Suicide Attempt