Saturday, April 20, 2024

సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే

- Advertisement -
- Advertisement -

Subramanian Swamy sensational tweet on Sushant death

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై సుబ్రమణ్య స్వామి సంచలన ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు.. హత్యే అని ఆయన ట్వీట్టర్ లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. హత్య జరిగిందనడానికి సాక్ష్యంగా ఓ డాక్యుమెంట్ ను కూడా ఆయన విడుదల చేశారు. 26 పాయింట్లతో డాక్యుమెంట్ ను ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ డెడ్ బాడీపై హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని సుబ్రమణ్య స్వామి తెలిపారు. ముంబయి పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. సుశాంత్ సింగ్ మరణంపై సిబిఐ విచారణకు సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యకు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తినే కారణమని సుశాంత్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Subramanian Swamy sensational tweet on Sushant death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News