*కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో అనిశెట్టి గెలుపు
*అభినందనలు తెలిపిన పలువురు ప్రజాప్రతినిధులు
మనతెలంగాణ/కాశిబుగ్గ: గ్రేటర్ వరంగల్ నగరంలోని 44వ డివిజన్ కార్పొరేషన్ ఉప ఎన్నికలల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి అనిశెట్టి సరిత ఘనవిజయం సాధించింది. గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపును ఎన్నికల అధికారులు నిర్వహించారు. మూడు రౌండ్ల లో ఉదయం 9గంటల లోపే విజేతలను ప్రకటించారు. మొత్తం 9,641ఓట్లు ఉండుగా అందులో 5,242లు ఓట్లు పోలైనవి, టిఆర్‌ఎస్ అభ్యర్థికి 3016ఓట్లు, బిజెపి అభ్యర్థి కొలను సంతోష్‌రెడ్డికి 2181 ఓట్లు పోలైనవి, 835ఓట్లుతో టిఆర్‌ఎస్ అభ్యర్థి అనిశెట్టి సరిత ఘనవిజయం సాధించిన్నట్లుగా టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దా స్యం వినయ్‌భాస్కర్, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌లు అన్నారు. అనంతరం ఇండోర్ స్టేడియం వద్ద విలేకర్ల సమావేశంను కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్, గంధ్రలయం చైర్మన్‌లతో పాటు పలువురు టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, నాయకురాలు తదితరులు ఉన్నారు.
కార్పొరేటర్ అనిశెట్టి సరిత వర్సెస్ రావుపద్మ…
గ్రేటర్ మేయర్ నరేందర్
గ్రేటర్ నగరంలోని 44వ డివిజన్ కార్పొరేటర్ అనిశెట్టి మురళీమనోహర్ హత్యకు గురి కావడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విధితమే. సిఎం కెసిఆర్ ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమా పథకాల వల్లే సరిత విజయం సాధించిందని అన్నారు. మంత్రి కెసిఆర్ నగరంలో అనేక ప్రభుత్వ సంక్షేమా పథకాలతో పాటు ప్రత్యేక నిధులను మంజూరు చేయడంతో నగరాని అందంగా తయారు చేయడం జరుగుతుందని అన్నారు. అయితే నగరంలోని కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్, సిపిఎం, సిపిఐలతో పాటు ఇతర పార్టీల నాయకుల వద్దకు వెళ్లీ మాకు మద్దతు ఇవ్వాలని చెప్పాడంతో వారు అగీకంరించడం జరిగిందని అన్నారు. కానీ బిజెపి పార్టీ అర్బన్ అధ్యక్షురాలు రావుపద్మ మాత్రం మేము పోటి చేస్తామని అన్నారు. దీంతో అనిశెట్టి సరిత వర్సెస్ రావు పద్మల మధ్య ఈ ఉప ఎన్నిక జరిగిందని అన్నారు. వచ్చే 2019 జరిగే ఎన్నికలల్లో కూడా రావు పద్మ ఓడిపోవాడం ఖ్యాయం అన్ని అన్నారు.
44వ డివిజన్ ప్రజలకు అకింతం…
పశ్చిమ ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్..
గ్రేటర్ నగరంలోని 44వ డివిజన్‌కు సంబంధించిన ఈ ఉప ఎన్నిక డివిజన్ ప్రజలకు అనిశెట్టి సరిత విజయంను అకింతం చేస్తున్నాట్లుగా తెలిపారు. అదే విధంగా సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమా పథకాలు ఒక్క వైపు మంత్రి కెటిఆర్ వరంగల్ నగరాని అనేక నిధులు కేటాయించాడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా 44వ డివిజన్ ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పని సరిగా అమలు చేసే విధంగా మా వంతుగా కృషి చేస్తామని అన్నారు. అందుకు ఎంఎల్‌ఎగా నేను, మేయర్, కూడా చైర్మన్ ప్రతి ఒక్కరం 44వ డివిజన్‌లో మౌళిక సదుపాయలతో పాటు నగరాని మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
కార్పొరేటర్ అనిశెట్టి సరిత…
గ్రేటర్ నగర పరిధిలోని 44వ డివిజన్‌ను ఆదర్శగా డివిజన్‌గా చేయడంతో పాటు సిఎం కెసిఆర్ ప్రజలకు ప్రవేశా పెట్టుతున్న సంక్షేమా పథకాలను ప్రజలకు అదే విధంగా తగు చర్యలు తీసుకోవాడం జరుగుతుందని అన్నారు. అలాగే బిజెపి నాయకురాలు రావు పద్మ వద్దకు వెళ్లీ నాకు మద్దతు ఇవ్వాలని అడుగుతే నీకు ఎందుకు రాజకీయాలు, అన్ని అన్నాడంతో పాటు తోటి మహిళ అని కూడా చూడకుండా మాట్లాడిందని అన్నారు. నా గెలుపుతో రావు పద్మ పూర్తిగా రాజకీయంగా ఓడిపోయిందని అన్నారు. నా గెలుపుకు సహాకారించిన కాంగ్రెస్‌కు, టిడిపి, వైఎస్‌ఆర్‌సి, ఇతర వామ పక్ష పార్టీలకు, కుల సంఘాలకు, ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపింది. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ సీరాజ్‌ఉద్ధీన్, గ్రంధలయ చైర్మన్, కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్, విద్యాసాగర్, సోమ మధుకర్, వస్కుల ఉదయ్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, నాయకురాలు, మహిళలలు తదితరులు ఉన్నారు.
పోలీసు పహారా…
44వ డివిజన్ ఉప ఎన్నిక నే పధ్యంలో ఇండోర్ స్టేడియం వద్ద పోలీసులు పహారా డీసీపీ వెంకట్రాంరెడ్డి
ఎసీపీలు రాజేంద్రప్రసాద్, శోభన్‌కుమార్, మధుసూదన్, సత్యనారాయణ, సీఐలు సంపత్‌రావు, సతీష్‌బాబు, విద్యాసాగర్, రవికుమార్, సదయ్య, శ్రీలక్ష్మి, సంతోష్‌లతో పాటు ప్రత్యేక పోలీసు బృందాలతో కౌటింగ్ వద్ద చుట్టుమట్టారు. ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు.