Wednesday, April 24, 2024

విజయవంతంగా ముగిసిన భారత్ బంద్

- Advertisement -
- Advertisement -

Successfully concluded Bharat Bandh

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ ఉదయం 11గంటల నుంచి 3 గంటల వరకు బంద్ లో పాల్గొన్నారు. రోడ్లను దిగ్బందించి.. అన్ని రకాల వాహనాలను నిలిపివేశారు. దుకాణాలను మూసివేశారు. ఇప్పుడు బంద్ ముగియడంతో బస్సులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ ఎంజిబిఎస్ నుంచి ఇప్పటికే బస్సులు రాకపోకలు ప్రారంభమయ్యాయి. దుకణాలు తెరుచుకున్నాయి. భారత్ బంద్ లో భాగంగా రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయవంతంగా బంద్ కొనసాగింది. తెలంగాణలో రోడ్లమీద కాంగ్రెస్, టిఆర్ఎస్ నిరసన తెలిపాయి. మోడీ ప్రభుత్వానివి రైతు వ్యతిరేక విధానాలంటూ నేతలు నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసేదాకా పోరాడతామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

Successfully concluded Bharat Bandh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News