Home రాష్ట్ర వార్తలు కరువు దారుణం, కోరిన సాయం స్వల్పం : కేంద్ర బృందం

కరువు దారుణం, కోరిన సాయం స్వల్పం : కేంద్ర బృందం

Untitled-1 సంగారెడ్డి / కరీంనగర్ / రంగారెడ్డి
రాష్ట్రంలో కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అడిగిన కరువు సహాయం మొత్తం ఏ మూలకూ సరిపోదని కేంద్ర కరువు పరిశీలన బృందం సభ్యులు స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో పర్యటించిన బృందానికి సారథ్యం వహించిన మహారాజ్ కుమార్ సంగారెడ్డి కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం నిజామాబాద్‌లో, మంగళవారం మెదక్ జిల్లాలో పర్యటించి, కరువు పరిస్థితులను స్వయంగా పరిశీలించామని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఊహించిన దానికన్నా దారుణంగా ఉన్నాయని ఆయన అభిప్రా యపడ్డారు. నిజామాబాద్ జిల్లా వారు రూ 1400 కోట్ల సహాయం అడిగార ని, మెదక్ జిల్లా యంత్రాంగం రూ.1600 కోట్ల సాయం కోరిందని వివరిం చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం రూ.2431 కోట్లు అడిగా రని, కరువు సహాయక చర్యలకు ఇది ఏ మూలకూ సరిపోదని స్పష్టం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత సహాయం కోరుతున్నది, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏమిటి అన్న వివరాలతో కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పి స్తామని తెలియజేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను అంచనా వేయడా నికి కేంద్ర అధికారుల బృందం సోమవారం వచ్చింది. మూడు బృందాలుగా విడిపోయిన ప్రతినిధులు నిన్న నిజామాబాద్, నల్లగొండ, వరంగల్, మహ బూ బ్‌నగర్ జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం నాడు మహారాజ్‌కుమార్ సారథ్యంలో బృందం మెదక్ జిల్లాలో, బ్రిజేష్ శ్రీవాత్సవ నేతృత్వంలోని బృం దం కరీంనగర్ జిల్లాలో, ఉత్పల్ కుమార్ నాయకత్వం వహిస్తున్న టీమ్ రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించాయి.పరిస్థితులను బేరీజు వేసిన ఈ బృందాల సభ్యులు ఎక్కిడికక్కెడ మీడియాతో మాట్లాడుతూ … కరువు పై కలవరం వ్యక్తం చేశారు. కరువు మండలాల సంఖ్య పెంచడానికి సిఫారసు చేస్తామని ప్రకటించారు.మెదక్ జిల్లాలో పర్యటించిన మహారాజ్‌కుమార్ బృందం తొ లుత కంగ్టి మండలం సర్దార్‌నగర్ తండాలో పర్యటించింది. అక్కడ తాగ డానికి కూడా నీరు లేని పరిస్థితిని స్వయంగా పరిశీలించింది. ట్యాంకర్‌తో నీ టిని సరఫరా చేస్తుండగా, తండాలోని మహిళలంతా నీరు పట్టుకునేందుకు వచ్చారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎండిపోయిన కంది పంటను వారు చూశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు.వానలు లేక పంటలు ఎండిపోయాయని, విత్తనాలు, ఎరువు లకు ఖర్చు చేసిన సొమ్ములు కూడా రాని పరిస్థితి ఉందని చెప్పారు. వరుసగా రెండో సంవత్సరం కరువు రావడంతో తాము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పారు.అనంతరం బోర్గి అనే గ్రామంలో ఈ బృందం పర్యటించింది. గామంలో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్న తీరును ప్రత్యక్షంగా చూశారు. ఆ తర్వాత కంగ్టి మండల కేంద్రానికి బృందం చేరుకుంది. అక్కడ ఎండిన కంది చేనును పరిశీలించారు.ఆ తర్వాత రాజా రంతండా చేరుకున్నారు. కందిపైరును, నీటి కొరతను పరిశీలించారు. అనం తరం మారుమూల ప్రాంతమైన మనూరు మండలం గూడూరుకు ఈ బృందం సభ్యులు చేరుకున్నారు. జిల్లాలోకి మంజీరా నది ప్రవేశిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పూర్తిగా ఎండిపోయి మైదానాన్ని తలపిస్తున్న తీరు వారికి కనిపించింది. వానలు లేనందున ఈ పరిస్థితి వచ్చిందని, కరువు తీవ్రత చాలా ఘోరంగా ఉందని, మూడు కిలో మీటర్ల దూరం నుంచి నీరు తెచ్చుకుంటున్నామని అక్కడి ప్రజలు తెలిపారు. భూగర్బ జలాలు పడిపోయాయని, బోర్లు వేస్తే కూడా నీరు రావడం లేదని, తమను ఆదుకోవాలని వారు వేడుకున్నారు. సంగారెడ్డి మండలం కలబ్‌గూర్ శివారు మంజీరా డ్యాంను ఈ బృందం సభ్యులు సందర్శించారు. హైద్రాబాద్‌కు, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న ఇంటెక్‌వెల్‌ను చూశారు. సింగూరు ప్రాజెక్టులో నీరు లేదని, మంజీరాలో నీరు లేక తాగు నీటి సరఫరా ఇబ్బందిగా మారిందని ఈ సందర్బంగా కలెక్టర్ రోనాల్డ్ రోస్ వివరించారు.
కరువు మండలాల పెంపునకు సిఫారుసు
కరీంనగర్‌లో కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, జిల్లాలో కరువు మండలాల పెంపునకు సిఫారసు చేస్తామని కేంద్రబృందం సారధి బ్రిజేశ్ శ్రీవాత్సవ స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఈ బృందం జిల్లాలోని భీమదేవరపల్లి, చిగురుమామిడి, హుస్నాబాద్, బెజ్జంకి, సిరిసిల్ల మండలాలలో పర్యటించి, పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నది. ముందుగా భీమదేవరపల్లి మండలం చాపగాని తాండ, కట్కూర్ గ్రామాల్లో ఎండిపోయిన పంటలను, చెరువులను పరిశీలించారు. అనంతరం కట్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన బ్రిజేష్ శ్రీవాత్సవకు గ్రామంలో మూడేళ్లుగా వర్షాలు లేక కరువు నెలకొందని రైతులు తెలిపారు. గ్రామంలో 500-600 అడుగుల మేరకు బోర్లు వేసినా చుక్క నీరు రావడం లేదని, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆ తరువాత హుస్నాబాద్ మండలం గండిపల్లి, కుందన్‌నానిపల్లి గ్రామాలలో పత్తి పంటను, ఎండిపోయిన బోర్లను బృందం పరిశీలించింది. అలాగే చిగురుమామిడి మండలం రేగొండలో తాగునీటి సరఫరా పథకాన్ని పరిశీలించింది. బెజ్జంకి మండలం గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, వడ్లూర్‌బేగంపేటల్లో ఎండిపోయిన పత్తి పంటలను, బోర్ బావులను పరిశీలించింది. సిరిసిల్లలో కరువు పరిస్థితులపై వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, పశు సంవర్థక శాఖలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను బృందం సభ్యులు తిలకించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రిజేష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, కేంద్రం నుంచి జిల్లాకు అధికంగా కరువు నిధులు వచ్చేలా కృషి చేస్తామన్నారు.
కేంద్రానికి నివేదిస్తాం
రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించామని రైతులు పడుతున్న ఇబ్బందులను పూర్తి స్థాయిలో నివేదికలు తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని కరువు బృందం సభ్యులు ఉత్పల్‌కుమార్ సింగ్, పొన్ను స్వామి వివరించారు. జిల్లాలో ఎండిపోతున్న చెరువులను, బీడు వారిని పొలాలను, అప్పుల పాలైన రైతుల గోసలను కరువు బృందం అడిగి తెలుసుకుంది. మంగళవారం నాడు ఈ బృందం జిల్లాలో పర్యటించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును సందర్శించి రైతులతో సభ్యులు మాట్లాడారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నందున ఖరీఫ్ ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలుచేస్తున్నారా అని వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జంట నగరాలకు నీరు అందించే గండిపేటజలాశయాన్ని సందర్శించి నీటి సామర్థం గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు చెరువు ఎండిపో వడానికి కారణాలు, చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల మండలం కేసారం, పరిగి మండలం రంగాపూర్‌లో ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటకు ఎంత పెట్టు బడి పెట్టారు, రుణాలు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు. వడ్డిలు ఎంత, ఎలా కడుతున్నారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ శివ సాగర్ చెరువును సందర్శించి వివరాలు ఆరాతీశారు. పంట నష్టానికి ఎకరా నికి 40 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, ఉపాధి హమీ పథకా న్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని , సబ్సిడీపై ఎరువులు, విత్తనా లు అందించాలని రైతులు కరువు బృందానికి మొరపెట్టుకున్నారు. జిల్లాలో కరువు పరిస్థితులను జాయింట్ కలెక్టర్ రజిత్‌కుమార్ కరువు బృందంకు వివ రించారు. జిల్లాలో 1.73 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేయగా 1.20 లక్షల హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు. భూగర్బ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని, తాగు నీటి బోర్లు ఎండిపోవడంతో అద్దెకు ప్రైవేట్ బోర్లు తీసుకుని నీటి సరఫరా చేస్తున్నామన్నారు. 24 మండలాల్లో ఉపాధి హమీ పథకం కింద అదనంగా 50 రోజులు పనిదినాలు కల్పించేందుకు చర్య లు తీసుకున్నట్లు తెలిపారు. 492 గ్రామ పంచాయతీలలో ఉపాధి హమీ పను లు కొనసాగుతున్నాయని తెలిపారు.