Friday, March 29, 2024

మానేరులో వింత చేప!

- Advertisement -
- Advertisement -

Strange Fish in Mid Manair Lake

తంగళ్లపల్లి(సిరిసిల్ల): విదేశాలలో మాత్రమే కనిపించే చేప.. మానేరు వాగులో కనిపించి వింత గొలిపింది. ఎస్సాఆర్‌ఆర్ రిజర్వాయర్‌లో మత్యకారులు చేపల వేటకు వెళ్లగా వారికి వలలో ఈ వింత చేప చిక్కింది. దీంతో ఈ చేప గూర్చి ఆరా తీయగా సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అంటారని తెలుసుకున్నారు. ఎలుక మూతి ఆకారంలో ఉండే ఈ చేపను చూసేందుకు స్థానికులు బారులు తీరారు. కొన్ని రోజుల క్రితమే ఈచేపను భారతదేశంలోని నదులల్లో గుర్తించినట్లు చేపను పట్టుకున్న మత్యకారుడు నరేష్ తెలిపాడు. గోదావరి నది నుండి మానేరు వాగులోకి వస్తున్న బ్యాక్ వాటర్ ద్వారా ఇక్కడికి చేరిఉంటుందని నరేష్ వెల్లడించాడు. స్థానికులు చేప ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంతో మార్కెట్ వద్ద సందర్శకుల తాకిడితో కిక్కిరిసిపోయింది.

Strange Fish in Mid Manair Lake

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News