Home తాజా వార్తలు ‘డబుల్’ పర్యటనకు బ్రేక్

‘డబుల్’ పర్యటనకు బ్రేక్

Sudden break for bhatti on double bed room tour

 

అర్ధాంతరంగా వెళ్లిపోయిన విపక్ష నేత భట్టి విక్రమార్క
లక్ష ఇళ్లు చూపిస్తామంటే పారిపోయారు : మంత్రి తలసాని

మన తెలంగాణ/ హైదరాబాద్: లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయమై మంత్రి తలసాని, సిఎల్పీ నేత భట్టి విక్రమార్కల పర్యటనకు శుక్రవారం బ్రేక్ పడింది. తమ సవాల్, ప్రతిసవాల్‌లో భాగంగా రెండోరోజు తుక్కుగూడ, రాంపల్లిలో నిర్మిస్తున్న ఇండ్లను భట్టి విక్రమార్కకు మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌లు కలిసి చూపించారు. అయితే భట్టి మాత్రం తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసిలో స్థలం లేనందున నగర శివారుల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామని స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఇండ్లు కట్టలేదని భట్టి అనడం సరికాదు. ఒకవేళ ఆయన జిహెచ్‌ఎంసిలో స్థలం చూపిస్తే అక్కడ తప్పకుండా ఇండ్ల నిర్మాణం చేపడుతామని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

శివార్లలో నిర్మిస్తున్నప గృహాల్లో 90 శాతం నరగ వాసులకే అని తెలిపారు. ఇండ్లు ఎక్కడ నిర్మించినా అవి హైదరాబాద్ వాసులకే ఇస్తామన్నారు. లక్ష ఇండ్లకు సంబంధించిన జాబితా ఇస్తామంటే కాంగ్రెస్ నేతలు పారిపోయారు అని మంత్రి తలసాని పేర్కొన్నారు. నగరంలో భూములు లేకనే శివారు ప్రాంతాల్లో నిర్మించామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. నగరంలో ప్రభుత్వ భూమి లేకుండా చేసింది కాంగ్రెస్ నేతలే అని ఆయన ధ్వజమెత్తారు. సిఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ శుక్రవారం తనకు చూపించిన తుక్కుగూడ, రాంపల్లి ప్రాంతాలు జిహెచ్‌ఎంసి పరిధిలోకి రావన్నారు. గత మునిసిపల్ ఎన్నికల్లో చూపించిన ఇళ్లనే ఇప్పుడు చూపిస్తున్నారన్నారు. జిహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపిస్తామని ఇప్పటివరకు కేవలం 3,428 ఇళ్లనే చూపించారని భట్టి పేర్కొన్నారు.

Sudden break for bhatti on double bed room tour