Friday, March 29, 2024

అక్కడే రూల్ బ్రేక్ చేశాం.. సుధీర్ బాబు ఇంటర్వ్యూ

- Advertisement -
- Advertisement -

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ’హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించగా మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సినిమాలో మెమరీ లాస్ అయిన పోలీస్ అధికారిగా సుధీర్ బాబు నటించారు. యాక్షన్ కొత్తగా ట్రై చేశారు. ’జాన్ విక్ 4’కు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లతో పని చేశారు.ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

ఎంగేజింగ్ థ్రిల్లర్…
ఈ సినిమాలో నేను ఎవరిని ’హంట్’ చేస్తున్నానని సస్పెన్స్ సినిమా అంతా ఉంటుంది. ప్రేక్షకులు నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. సినిమాలో ప్రేమకథ లేదు. ఫ్రెండ్‌షిప్ మీద ఎక్కువ ఎమోషన్ ఉంటుంది.
అతని పాత్ర ప్రభావం చూపిస్తుంది…
సినిమాలో శ్రీకాంత్‌ది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. కానీ ఉన్నంత సేపూ అతని పాత్ర ప్రభావం చూపిస్తుంది. సీనియర్ హీరో ఉంటే బావుంటుందని దర్శకుడు మహేష్ ఆయనను తీసుకున్నాడు. భరత్ ఛాయిస్ కూడా దర్శకుడిదే. తనకు కూడా రెండు, మూడు యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. లోకల్ హీరోల కంటే భరత్ అయితే కాంబినేషన్ ఫ్రెష్‌గా ఉంటుందని తీసుకున్నాడు.
యాక్షన్ అంతా రియల్‌గా…
ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటాయి. ఈ సినిమా యాక్షన్ అంతా రియల్ గా ఉండాలని ’జాన్ విక్’ సినిమాలను రిఫరెన్స్‌గా తీసుకున్నాం. జాగ్రత్తలు తీసుకుని నేను యాక్షన్ సీక్వెన్సులు చేశాను.

అక్కడే రూల్ బ్రేక్ చేశాం…
సినిమా మొత్తం రిస్క్ చేశాం. ఇందులో హీరోయిన్ లేదు. మేం అక్కడే రూల్ బ్రేక్ చేశాం. రెండు నిమిషాల్లో కథలోకి వెళ్ళిపోతారు. కథ మొత్తం కొత్తగా ఉంటుంది. లాంగ్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఇప్పుడు ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్, కథలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఈ సినిమా విజయం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది.
నెక్స్ సినిమాలు…
నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో ’మామా మశ్చీంద్ర’ అని ఓ సినిమా చేస్తున్నాను. ఇది కామెడీ అండ్ యాక్షన్ జానర్ సినిమా. ఇందులో ట్రిపుల్ రోల్ చేస్తున్నాను. యువి క్రియేషన్స్ లో ఇంకో సినిమా ఉంది. తండ్రీ కొడుకుల మధ్య జరిగే డ్రామా ఇది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News