Thursday, July 18, 2024

మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

Musi Riverfront Corporation

 

హైదరాబాద్: మూసీరివర్ ఫ్రంట్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎల్‌బి నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఉత్తర్వులపై సంతకం చేశారు. క్యాబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో సుధీర్ రెడ్డి మూడు సంవత్సరాలు కొనసాగుతారు. మూసీనది అభివృద్ధి కోసం వేలాధి కోట్ల రూపాయలతో రూపొందించిన ప్రణాళికలను సుధీర్‌రెడ్డి అమలు చేయాల్సి ఉంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పదవిలో సుధీర్‌రెడ్డిని సిఎం కెసిఆర్ నియమించడంపట్ల టిఆర్‌ఎస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సుధీర్‌రెడ్డి హైదరాబాద్ లోని మలక్‌పేట డివిజన్ నుంచి 1986లో కార్పొరేటర్‌గా రాజకీయాల్లో ప్రవేశించారు. ఆతర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 2004 ఎన్నికల్లో ఎల్‌బినగర్ శాసనసభ్యుడుగా గెలిచారు.

సుధీర్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మెదిలారు. 2004 నుంచి 2008 వరకు హూడాఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. దేశంలోని పెద్ద ఎక్స్‌ప్రెస్‌వేలో ఒకటైన 11.6 కిలోమీటర్ల పివి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సుధీర్‌రెడ్డి హుడాఛైర్మన్‌గా ఉన్నప్పుడే నిర్మించారు. అలాగే ఔటర్‌రింగ్ రోడ్ ప్లానింగ్‌లో సుధీర్‌రెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కృష్ణయ్యపై ఓటమికి గురయ్యారు. ఆతర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో ఎల్‌బినగర్‌అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి టిఆర్‌ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ పైన 17,848 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న సుధీర్ రెడ్డిని సిఎం కెసిఆర్ మూసీ రివర్ ఫ్రెంట్ డెవెలఫ్‌మెంట్ కార్ఫొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు.

Sudheer Reddy as Chairman of Musi Riverfront Corporation
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News