Home తాజా వార్తలు పెళ్ళి వద్దు అన్నందుకు యువకుడి ఆత్మహత్య…

పెళ్ళి వద్దు అన్నందుకు యువకుడి ఆత్మహత్య…

Suicide

 

సదాశివనగర్ : తల్లిదండ్రులు  పెళ్ళి వద్దనందుకు ఓ యువకుడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన పై సదాశివనగర్ ఎస్సై జె.నరేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మొడెగాం గ్రామానికి చెందిన కడతల వెంకట్‌రెడ్డి అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు కడతల సంతోష్‌రెడ్డి (27) గత మూడు సంవత్సరాల క్రితం ఉపాధి కొరకు గల్ఫ్ దేశం వెళ్ళి రెండు నెలల క్రితం సెలవు పై స్వగ్రామానికి వచ్చాడు. వచ్చినప్పటి నుండి తనకు పెళ్ళి చేయాలని తల్లిదండ్రులకు కోరగా ఇప్పుడే పెళ్ళి వద్దు మరో సంవత్సరం పాటు దేశం వెళ్ళి సంపాదించుకొని పెళ్ళి చేసుకోవాల్సిందిగా వారు తెలిపారు.

ఆ తరువాత 28 జూన్ రోజున నానమ్మ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి ద్విచక్రవాహనం పై కామారెడ్డికు బయలుదేరాడు. 29 నాడు సంతోష్‌కు తండ్రి ఫోన్ చేయగా గాంధారి ఎక్స్ వరకు వచ్చానని తెలిపి రాకపోవడంతో మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం 6.00 గంటలకు వెంకట్‌రెడ్డి అన్న రాజిరెడ్డి గ్రామ శివారులో గల తమ పశువుల కొట్టంలో సంతోష్ ఉరివేసుకున్నట్లు సమాచారం ఇవ్వగా గ్రామస్తులతో కలిసి వెళ్ళి చూడగా కొడుకు మృతి చెంది ఉన్నాడని మృతుని తండ్రి తెలిపాడన్నారు. అప్పుడే పెళ్ళి వద్దనందుకు మనోవేదనకు గురై తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై వివరించారు. శవాన్ని పోస్టు మార్టం కొరకు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

Suicide of Young Man who is not Married