Home జాతీయ వార్తలు మద్దతుదారులతో ఆలోచించాకే… బిజెపికి మద్దతుపై నిర్ణయం

మద్దతుదారులతో ఆలోచించాకే… బిజెపికి మద్దతుపై నిర్ణయం

బెంగళూరు: బహుభాషా నటి, ఇండిపెండెంట్‌గా మాండ్యా నుంచి పార్లమెంటుకు ఎన్నికైన సుమలత తనకు మద్దతుగా నిలిచిన బిజెపికి ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికలో తన ప్రత్యర్థి, కర్ణాటక ముఖ్యమంత్రి హెడ్‌డి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను సుమలత ఓడించారు. తన మద్దతుదారులను, ఓటర్లను కలిసి మాట్లాడిన తర్వాత బిజెపికి మద్దతు ఇవ్వడం గురించి నిర్ణయం తీసుకుంటానన్నారు. కర్ణాటక బిజెపి అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణలను కూడా కలుసుకొని మాండ్యాలో తన విజయానికి సహకరించినందుకు సుమలత కృతజ్ఞతలు తెలిపారు. ‘ఒక విషయంలో నాకు స్పష్టత కావాలి. ఇండిపెండెంట్‌గా ఎన్నికైన వ్యక్తి మరో పార్టీలో చేరడానికి రాజ్యాంగపరంగా అవకాశం లేదని తెలుసు. కానీ మద్దతివ్వవచ్చా? అనేది నేను తెలుసుకోవాలి. ఏది ఏమైనా ప్రజాభిప్రాయమే నాకు ముఖ్యం’ అని సుమలత చెప్పారు.

sumalatha ambareesh respond on Supporting to BJP