Home తాజా వార్తలు తండ్రి అయిన బాలీవుడ్ హీరో

తండ్రి అయిన బాలీవుడ్ హీరో

 Sumeet Vyas and wife Ekta Kaul give born to sonముంబయి : బాలీవుడ్ హీరో సుమీత్ వ్యాస్ తండ్రి అయ్యాడు. సుమీత్ వ్యాస్, ఎక్తా కౌల్ దంపతులకు గురువారం మగపిల్లాడు పుట్టాడు. తమ ఇంట పండంటి మగ బిడ్డ అడుగుపెట్టాడని సుమీత్ వ్యాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమకు మగ బిడ్డ జన్మించడంతో వాడితో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నామని ఆయన తెలిపారు. బాబుకు వేద్ అనే పేరు పెట్టామని ఆయన పేర్కొన్నారు. తల్లితండ్రులుగా మారిన సుమీత్ వ్యాస్, ఎక్తా కౌల్ దంపతులకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.