Home రాష్ట్ర వార్తలు సెలవుల్లో క్లాసులు

సెలవుల్లో క్లాసులు

ఇంటర్ బోర్డు ఉత్తర్వులను కాలరాస్తున్న ప్రైవేట్ యాజమానాలు
ఎండల్లో నానాయాతన పడుతున్న విద్యార్థులు

summer-classedసిటీ బ్యూరో: ఇంటర్మీడియట్ విద్యా మండలి ఉత్తర్వు లంటే ప్రైవేట్ కళా శాలలకు కనీసం చీమ కుట్టినట్టు కూ డా లేదు. ఇంటర్‌కు సంబంధించి 2015-16 విద్యా సంవత్సరం ముగిసిపోవడం తో మార్చి 29 నుంచి మే 31 వరకు ఇం టర్ బోర్డు అన్ని కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. వాటిని విధిగా అమలు చేయా ల్సిన అనేక ప్రైవేట్ కళాశాలల యాజమా న్యాలు యథేచ్ఛగా తరగతులను నిర్వహిస్తున్నా యి. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్ర త్యేకంగా ఆయా ప్రిన్సిపా ల్స్‌కు ఫోన్లు చేసి కళాశాలను మూసివేయాలని ఆదేశించారు. అయినా ఫలితం శూన్యం. ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడమే కాకుండా ప్రైవేట్ విద్యా సంస్థలను పూర్తి స్థాయిలో కట్టడి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అన్ని కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడచుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఎప్పటిలాగే పలు కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక కళాశాలలు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దర్జాగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేకుండానే తమ విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులను సైతం చేర్చుకుని ఎంసెట్ పేరుతో అందిన కాడికి దండుకుంటున్నాయి.
ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో వేడిమికి తాళలేక కొంతమంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. వీటికి తోడు దాదాపుగా కళాశాలలన్నీ కమర్షియల్ కాంప్లెక్స్‌లలోనే ఉండడం, క్లాస్ రూమ్‌లలో గాలి, వెలుతురు సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఉక్కపోతకు గురవుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు క్లాస్‌లు వదులుతున్నారు. ఆ సమయంలో ఆర్‌టిసి బస్సులు షిఫ్ట్ మారే సమయం కావడంతో అవి సైతం అందుబాటులో లేక విద్యార్థులు ఎండలోనే గంటల తరబడి వేచి చూసే పరిస్థితి ఏర్పడుతోంది.
విద్యాశాఖ అధికారులకు చిత్తశుద్ధి కరువు : విద్యార్థి సంఘాలు
ప్రభుత్వ నింబంధనలను అమలు చేయాల్సిన అధికారులు అందుకు తగ్గట్టుగా వ్యవహరించపోవడం వల్లే ప్రైవేట్ కళాశాలల ఆటలు ఆడింది ఆట, పాడిందిగా పాటగా కొనసాగుతున్నాయని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. అసలు విద్యాశాఖ అధికారులు కళాశాలలకు సెలవు అధికారికంగా ప్రకటించింది అమలు చేయడానికి కాదని, ఆ పేరుతో ‘ఆమ్యామ్యా’లు దండుకోవడానికేనని వారు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ ఉత్తర్వులను అమలుచేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఉదయం 9 గంటల తర్వాత ఏ ప్రైవేట్ కళాశాలకు వెళ్లినా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ ఇట్టే పట్టుబడే అవకాశం ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనమని వారు వెల్లడించారు. కనీసం తాము ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ప్రైవేట్ సంస్థలను కట్టడి చేయాలని నిజంగా చిత్తశుద్ది ఉంటే తామే దగ్గరుండి కళాశాలలకు తీసుకువెళ్తామని రమ్మనమని అంటున్నారు.
ఇప్పటికే 4 కళాశాలలకు నోటీసులు
ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి రవికుమార్
నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న 4 ప్రైవేట్ కళాశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎ.రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా పలు కళాశాల యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్న మాట వాస్తవమేనని అన్నారు. ఆయా కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి, వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లలను కళాశాలలకు పంపవద్దని కోరారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తే తనకు వెంటనే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పాట్ వాల్యుయేషన్ నేపథ్యంలో పూర్తి సమయం కేటాయించలేకపోతున్నామని రవికుమార్ తెలిపారు.