Saturday, January 28, 2023

ఇవి ఎలుగుబంట్లే.. కాని జూ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇలా..!!

Sun bears at Bandung Zoo very hungry and thin
పార్క్ లో తిండి లేక బక్కచిక్కిన సన్ బేర్స్… విజిటర్స్ విసిరిన ఆహారాన్ని తింటున్న దృశ్యం
- Advertisement -

అడవిలో ఉండే జంతువులకు ఎంతో కష్టపడి వేటాడితే కాని తిండి ఉండదు. కాని, జూలో జంతువులకు అటువంటి సమస్య ఉండదు.ఎందుకంటే, పొద్దున్నే జూ సిబ్బంది వాటికి కావాల్సిన తిండి ని వాటి బోనులోనే పెట్టి ఫుల్లుగా నిద్రపుచ్చుతారు.

ఎందుకంటే, అవి మంచిగా, ఆరోగ్యంగా, బలిష్టంగా ఉంటేనే కదా… జూ కు పర్యాటకులు వచ్చేది.. నాలుగు రాళ్లూ వచ్చేది.

కాని, ఒక్క జూ పార్క్ మాత్రం ఇందుకు మినహాయింపు… జూ ను చూడటానికి వచ్చిన పర్యాటకులే ఆ జంతువులకు ఆహారాన్ని విసిరేయాల్సిన పరిస్థతి. అందుకే ఆ జూలోని జంతువులు బక్క చిక్కి… రేపో మాపో అన్నట్టుగానే ఉంటాయి.

పర్యాటకులు కూడా వాటి వైపు జాలీగా చూడటమే తప్ప… ఏం చేయలేని పరిస్థతి.

ఇంతకీ ఆ జూ ఎక్కడుందనేగా మీ డౌట్. అది ఇండోనేషియాలోని బండుంగు జూ. ఈ జూలోని జంతువులను జూ సిబ్బంది పట్టించుకోక బక్కచిక్కిపోయాయి. గత సంవత్సరం సరైన పోషణ లేక ఓ ఏనుగు చనిపోవడంతో అప్పటి నుంచి ఈ జూను మూసేయాలని ఇండోనేషియా ప్రజలు డిమాండ్ చేశారట. అంతే కాదు… అక్కడికెళ్లే పర్యాటకులు కూడా జూను మూసేయాలని జూ లోని జంతువులను అడవిలో వదిలేయాలని డిమాండ్ చేశారట.

అయినా.. అక్కడి జూ సిబ్బంది వాటికి సరైన ఆహారం అందించట్లేదట. కొన్ని జంతువులయితే… అవి విసర్జించిన మలాన్నే మళ్లీ తింటున్నాయట. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles