తెలంగాణ సహా దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆదివారంనాడు విషాదభరిత ఘటనలు చోటు చేసుకున్నాయి. నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నదిలోకి స్నానానికి పడవలో వెళ్లి ప్రమాదవశాత్తు 5గురు యువకులు మృత్యువాతపడ్డారు. వీరంతా ఒకే కుటుంబీకులు. హైదరాబాద్‌లోని బేగంబజార్‌కు చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్ పరిధి చింతల్‌కుంటలో హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి ఇద్దరు చనిపోయారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో వినాయక విగ్రహాలను తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఢిల్లీలోని ఆర్‌కె పురం ఏరియాలో చెట్టు కూలిన విద్యుత తీగలపై పడడంతో షాక్‌కు గురై ఇద్దరు, బవానా ప్రాంతంలో మోటార్ సైకిల్‌ను టెంపో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించారు. ఇక ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూ లిన ఘటనలో ఏడుగురు మరణించారు. మృతుల్లో మహారాష్ట్ర, యూపీ, ఉత్తరాఖండ్ వాసులున్నారు. పైలట్‌ది జైపూర్. పుణె సమీపంలోని ఇంద్రాయణి నదిపై ఉన్న పురాతన వంతెన కూలిన ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. 32మది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలిస్తుండగా అది ప్రమాదానికి గురై మృతుడి కుటుంబీకులు ఐదుగురు మరణించారు.
బాసర వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు యువకులు, హైదరాబాద్, కోరుట్లలో విద్యుత్ షాక్‌తో
నలుగురు మృత్యువాత కేదార్‌నాథ్ వద్ద హెలికాప్టర్ కూలి ఏడుగురు, పుణె సమీపంలో వంతెన కూలిన
దుర్ఘటనలో నలుగురు మృతి యూపీలో అంబులెన్స్‌కు ప్రమాదం.. ఐదుగురు మృతి ఢిల్లీలోనూ విషాదాలు
పుణేలో కూలిన వంతెన
నలుగురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
భారీవర్షాలకు ఉప్పొంగిన ఇంద్రాయణి నది ప్రవాహ ఉధృతికి కూలిపోయిన వంతెన
నీళ్లలో కొట్టుకుపోయిన పర్యాటకులు
పుణే: పుణేలోని తలేగావ్ ప్రాంతంలో ఇంద్రాయణి నదిపై ఉన్న పాత వంతెన ఆదివారం మధ్యా హ్నం కూలిపోయిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ప్రవాహంలో దాదాపు 15-20 మంది వేగంగా నీటి ప్రవాహంలో కొట్టుకు పోయారు. శిథిలావస్థకు చేరిన ఈ వంతెనపై కొద్దికాలంగా వాహనాల రాకపోకలను బంద్ చేశారు. అయితే భారీవర్షాలు, ఇంద్రాయణి నది వద్ద ఉప్పొంగుతున్న ప్రవాహాన్ని చూసేందుకు అనేకమంది వంతెనపై చేరుకోవడంతో వంతెన కొట్టుకుపోయింది. చాలా మంది నీటిలో పడిపోయారు. నీటిప్రవా హం ఉధృతికే వంతెన కూలిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యం త్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.
నీటిలో కొట్టుకు పోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 32 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. పుణే, పింప్రి చిం చ్వాడ్ ప్రాంతాలలో భారీవర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ చేశారు. పుణే రూరల్ ప్రాంతంలోని మావల్ ప్రాంతంలో ఉన్న ఈ వంతెనను 4-5 ఏళ్లక్రితం మరమ్మతు చేసినా, ఈ వంతెన ఎప్పుడు కూలుతుందో అని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే చాలా మంది పర్యాటకులు పొంచి ఉన్న ప్రమాదం తెలియక వంతెనపై నుంచి ఇంద్రాయణి నదీ ప్రవాహాన్ని చూసేందుకు వచ్చారు.