Home హైదరాబాద్ నగర ప్రజలపై భానుడి ప్రతాపం

నగర ప్రజలపై భానుడి ప్రతాపం

Summer-Hyderabad

కూకట్‌పల్లి : నగర ప్రజలపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం విలవిలలాడుతున్నారు. గత పది రోజులుగా ఉష్ణోగ్రత పెరగడంతో ఎండ వేడిమి తీవ్రంగా ఉంటుంది. ఉదయం 8 గంటల నుండే భానుడు భగభగా మనడంతో రోడ్లపై జనం కనబడడం లేదు.ఎంతో అవసరమైతే తప్పా రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. సూర్య ప్రతాపానికి వేడిగాలులు కూడా తోడవ్వడంతో మధ్యాహ్నం వేడి సెగలు కక్కుతోంది. విద్యార్థులు, రోడ్లపై చిరి వ్యాపారాలు చేసుకునే వారు, దినసరి కూలీలు, తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఎండతో తీవ్ర ఇబ్బందులను ఎదురు కుంటున్నారు. ద్విచక్ర వాహనదారులు రోఢ్లపై తిరగాలంటే అనేక ఇక్కట్లను పడుతున్నారు. హైల్మెట్ లేకుండా వాహనాల పై బయటకు వెళ్లేవారు ఓ పక్క వేసవి తాపంతో ఉబ్బరంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరో పక్క ఎండ వేడిలో బైక్‌లోగల పెట్రోల్ సైతం అవిరైపోతుందని వాహనాదారులు వాపోతు న్నారు. నానాటికి అనూన్యంగా పెరుగుతున్న ఎండ తీవ్రతతో వ్యాధులు సోకే ప్రమాధముందని హెచ్చరిస్తూ వేసివి వ్యాధుల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు డాక్టర్లు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో వాంతులు, విరోచనాలు, గొంతు నొప్పి, విష జ్వరాలుతో సోకే ప్రమాదం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంతోష్ క్లినిక్ డాక్టర్ విలాస్ పాటిల్ తెలిపారు. జగద్గిరిగుట్టలోగల ఆయన క్లినిక్‌లో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎండలకు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పాటించాల్సిన పలు సూచనలను మనతెలంగాణ ప్రతినిధి ద్వారా తెలియజేశారు.

వేసవిలో తప్పక పాటించాల్సిన పలు జాగ్రతలు

  • ఎండలో ప్రయాణం చేసి వచ్చిన వెంటనే నీటిని తాగరాదు
  • మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీటి కాకుండా కాచి వడపోసి చల్లార్చిన పరిశుభ్రమైన నీటిని త్రాగాలి
  • రోడ్డుపై లభించే అపరిశుభ్ర ఆహార పదార్ధాలను తినవద్దు
  • వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మలమూత్ర విసర్జన అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
  • ఎండలో ఎక్కువగా తిరగకుండా ఏవైనా పనులంటే ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకోవాలి
  • రసాయనాలతో తయారైయ్యే శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరం
  • మంచి నీళ్లు ఎక్కువగా తాగడం, కొబ్బరి బోండాలను సేవించడం మంచిది
  • ఐస్ వేసి జూస్‌లను సేవించడం ప్రమాదకరం
  • ఎండ తీవ్రతతో సోకే విష జ్వరాల భారిన పడకుండా ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాలు తీసుకోవాలి
  • డాక్టర్ల సలహాలతో డీహైడ్రేషన్ పౌడర్లను నీటిలో కలుపుకుని రోజులో అత్యధిక సార్లు సేవించడం మంచిది