Thursday, March 28, 2024

ఐపిఎల్‌కు ఆరేంజ్ ఆర్మీ రెడీ

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌కు ఆరేంజ్ ఆర్మీ రెడీ
సమరోత్సాహంతో సన్‌రైజర్స్ హైదరాబాద్

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ కోసం ఆరేంజ్ ఆర్మీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. ఈసారి హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో జట్టులో కొత్త జోష్ నెలకొంది. రెండేళ్లుగా జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి తిరిగి వార్నర్‌కు సారథ్యం అప్పగించారు. ఇక వార్నర్ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును విజయపథంలో నడిపించాలని తహతహలాడుతున్నాడు. విలియమ్సన్ వంటీ అనుభవజ్ఞుడి సేవలు అందుబాటులో ఉండడం కూడా వార్నర్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మెంటర్‌గా వ్యవహరిస్తున్న వివిఎస్.లక్ష్మణ్ కూడా జట్టుకు సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధమయ్యాడు. మురళీధరన్ వంటి దిగ్గజం కూడా సన్‌రైజర్స్‌కు అందుబాటులో ఉన్నాడు.

మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సన్‌రైజర్స్ సమతూకంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఐపిఎల్‌లో తనదైన ముద్ర వేసిన హైదరాబాద్ ఈసారి కూడా సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. ఇతర జట్లతో పోల్చితే సన్‌రైజర్స్ చాలా బలంగా కనిపిస్తోంది. దీనికి తోడు వార్నర్, విలియమ్సన్ వంటి దిగ్గజాలు అందుబాటులో ఉండడంతో బ్యాటింగ్ విభాగం తిరుగు లేకుండా తయారైంది. అంతేగాక మనీష్ పాండే, జానీ బైర్‌స్టో, వృద్ధిమాన్ సాహా వంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఈసారి కూడా వార్నర్, విలియమ్సన్‌లే జట్టుకు చాలా కీలకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా వీరికుంది. మనీష్ పాండే, బైర్‌స్టో తదితరులు కూడా విధ్వంసక బ్యాటింగ్‌తో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మహ్మద్ నబి, విజయ్ శంకర్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇటీవల ముగిసిన కరీబియన్ లీగ్‌లో నబి అసాధారణ రీతిలో రాణించాడు. ఐపిఎల్‌లో కూడా అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు.
తిరుగులేని బౌలింగ్
మరోవైపు బౌలింగ్‌లో కూడా హైదరాబాద్‌కు తిరుగులేదనే చెప్పాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లుగా పేరు తెచ్చుకున్న భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, నబిలు జట్టులో ఉన్నారు. ఈసారి కూడా ఈ ముగ్గురే బౌలింగ్ బాధ్యతలను మోసేందుకు సిద్ధంగా కనిపిస్తున్నారు. తాజాగా మిఛెల్ మార్ష్ వంటి ఆస్ట్రేలియా స్టార్ సేవలు కూడా జట్టుకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన ఐపిఎల్ టోర్నీల్లో భువనేశ్వర్, రషీద్ ఖాన్‌లు అసాధారణ రీతిలో రాణించారు. సన్‌రైజర్స్ విజయాల్లో వీరిదే కీలక పాత్ర. దుబాయి వేదికగా జరుగుతున్న ఐపిఎల్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బాసిల్ థంపి, అభిషేక్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్, సమద్ తదితరులు కూడా బౌలింగ్‌లో సత్తా చాటాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు.

Sun Risers Hyderabad ready for IPL 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News