Wednesday, November 6, 2024

మంచి జోష్‌తో…

- Advertisement -
- Advertisement -

Sundeep Kishan's 'A1 Express' first look released

యంగ్ హీరో సందీప్ కిషన్ 25వ చిత్రం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ త్వరలో రిలీజ్‌కి రానుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. డెన్నిస్ జీవన్ కనుకోలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్,  సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్లలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్లు ఆకట్టుకోగా.. తాజాగా ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. సందీప్ కిషన్ చొక్కా విప్పి గాల్లో ఎగరేస్తూ మంచి జోష్‌తో కనిపిస్తున్నాడు. హాకీ స్టేడియంలో ఒకటే కోలాహాలం కనిపిస్తోంది. గెలుపు తాలూకా ఆనందం సందీప్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Sundeep Kishan’s ‘A1 Express’ first look released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News