Friday, April 19, 2024

కొత్త మూవీని ప్రారంభించిన సందీప్ కిషన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో సందీప్ కిషన్ జోష్ పెంచాడు. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ‘గల్లీరౌడీ’తో మంచి విజయాన్ని అందుకున్న సందీప్ కిషన్ తాజాగా తన కొత్త మూవీని ప్రారంభించాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ తన న్యూ మూవీని చేస్తున్నాడు. ఆదివారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో నిర్వహించారు. హీరోలు అల్లరి నరేష్, నాగ శౌర్యలు ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ను చిత్రయూనిట్ త్వరలోనే ప్రారంభించనుంది.

Sundeep Kishan’s New Movie Pooja Ceremony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News